నరాల బలాన్ని పెంచే ఫుడ్ ఇదే |

నరాల బలాన్ని పెంచే ఫుడ్ ఇదే |

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన నరాలు సరిగ్గా పనిచేయడానికి, మెదడు కణాలు కుశించిపోకుండా ఉండడానికి, ముఖ్యంగా ముసలితనంలో కూడా బ్రెయిన్‌ హెల్త్‌ కాపాడటానికి చాలా కీలకమైన పోషక పదార్థం. చాలామంది దీని మూలం చేపలేనని భావిస్తారు, కానీ వాస్తవానికి చేపల్లో ఒమేగా-3 కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, 100 గ్రాముల చేపలో కేవలం 200 నుంచి 300 మిల్లీగ్రాముల వరకు మాత్రమే ఒమేగా-3 ఉంటుంది.

 గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!

మన శరీరానికి రోజుకి సుమారు 1.6 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అవసరం అవుతుంది. అంటే రోజూ సగం కిలో చేప తినకపోతే ఆ అవసరాన్ని తీర్చడం కష్టమే. కానీ చేపల కంటే చాలా చవకగా, సులభంగా దొరికే వనరుగా వాల్నట్స్ (అక్రోట్స్) ఉంటాయి. రోజుకు నాలుగు లేదా ఐదు వాల్నట్స్ తింటే చాలు — అవి సుమారు 15–20 గ్రాముల బరువులో ఉంటాయి, అందులోనే మన శరీరానికి కావలసిన 1.7 గ్రాముల ఒమేగా-3 లభిస్తుంది.

Cloves | లవంగం తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.

ముఖ్యంగా వృద్ధుల కోసం ఇది ఎంతో ప్రయోజనకరం. రోజూ రాత్రి నాలుగు లేదా ఐదు వాల్నట్స్ నీటిలో నానబెట్టి, ఉదయం మొలకలు లేదా పండ్లు తినేటప్పుడు వాటిని తీసుకోవచ్చు. ఈ వాల్నట్స్‌లో ఉండే మంచి కొవ్వులు బ్రెయిన్ ఆకారంలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచి, నరాల వ్యవస్థను బలపరుస్తాయి. మతిమరుపు, నరాల బలహీనత, మెదడు కణాల క్షీణత వంటి సమస్యల నుండి రక్షణ ఇస్తాయి.

కర్నూల్ లో మరో ఘోర ప్రమాదం.

అందుకే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అందించే వాల్నట్స్‌ను మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోండి. ముసలితనంలో మెదడు చురుకుగా, నరాలు బలంగా ఉండటానికి ఇది సహజమైన అద్భుత మందు.

టెస్టోస్టెరాన్ స్థాయి పెంచే సహజ ఆహారాలు మరియు చిట్కాలు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *