ఇక పోషకాహారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈరోజు హెల్త్ టిప్‌లో భాగంగా డాక్టర్ గారిని అడిగి ఒమేగా–3 అనే ముఖ్యమైన పోషకం మనకు సరిపడా అందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో పోషకాహారం గురించే చర్చిస్తున్నాం కదా. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని చెప్పినప్పుడు, ఒమేగా–3 కూడా చాలా అవసరమైన పోషకం. మరి ఇది ఎక్కువగా ఉండే ఆహార వనరులు ఏవో ఒకసారి వివరించండి.
యాలుకుపొడి – హై బీపీ తగ్గించడంలో సహజమైన అద్భుతం.
ఒమేగా–3 ఫ్యాట్ బ్రెయిన్ సెల్స్, నర్వ్ సెల్స్ బలంగా ఉండటానికి, అవి సరిగ్గా పనిచేయడానికి, అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి చాలా ముఖ్యమైనది. గుడ్ కొలెస్ట్రాల్ పెరగడంలో కూడా దీనికి కీలక పాత్ర ఉంది. పెద్దవాళ్లకు రోజుకు సుమారుగా 1.6 గ్రాముల ఒమేగా–3 అవసరం ఉంటుంది.
చాలామంది చేపల్లో ఒమేగా–3 ఉంటుంది కదా అంటారు. నిజమే, కానీ చేపల ద్వారా 1.6 గ్రాముల ఒమేగా–3 పొందాలంటే సుమారుగా అరకేజీ నుంచి మూడు–పావు కేజీ వరకు చేపలు తినాల్సి వస్తుంది. ఎందుకంటే 200–300 మిల్లీగ్రాముల ఒమేగా–3 మాత్రమే కొంతమంది చేపల్లో ఉంటుంది. అంత మొత్తంలో చేపలు తినడం, దానికి అయ్యే ఖర్చు కూడా అందరికీ సాధ్యం కాదు. పైగా చేపల్లో నిజంగా ఎంత ఒమేగా ఉందో మనకు స్పష్టంగా తెలియదు.
చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్‌చెరులో విషాద ఘటన.
ఇక్కడే వెజిటేరియన్‌లకు ఒక చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే వాల్‌నట్స్. రోజుకు కేవలం నాలుగు వాల్‌నట్స్ తింటే సరిపోతుంది. ఒక్కో వాల్‌నట్‌లో సుమారుగా 5 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. అంటే నాలుగు వాల్‌నట్స్ కలిపితే దాదాపు 1.7 గ్రాముల ఒమేగా–3 ఫ్యాట్ మన శరీరానికి అందుతుంది. 100 గ్రాముల వాల్‌నట్స్‌లో సుమారుగా 11 గ్రాముల ఒమేగా–3 ఫ్యాట్ ఉంటుంది.
ఇంకా మరింత చవకగా కావాలంటే అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) ఉన్నాయి. రోజుకు రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు అంటే సుమారుగా 14–15 గ్రాములు. వీటిని కొద్దిగా దోరగా వేయించి, పొడిగా చేసుకుని భోజనంలో కలిపినా లేదా ఒట్టిగానే తిన్నా సరే, దాదాపు 1.7 గ్రాముల ఒమేగా–3 ఫ్యాట్ అందుతుంది. రెండు స్పూన్ల అవిసె గింజల ఖర్చు పెద్దగా ఉండదు, చాలా తక్కువలోనే దొరుకుతుంది.
ఎముకలు ఎందుకు వీక్ అవుతున్నాయి? కూల్‌డ్రింక్స్ వల్ల వచ్చే నాలుగు ప్రధాన నష్టాలు.
అలాగే చియా సీడ్స్ కూడా మంచి వనరు. రోజుకు రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్‌ను నీటిలో నానబెట్టి తింటే సరిపోతుంది. సబ్జా గింజల మాదిరిగా సాయంత్రం ఫ్రూట్స్‌తో కానీ, డిన్నర్‌లో కానీ, లేకపోతే ఉదయం మొలకలతో కలిసి తీసుకోవచ్చు.
ఈ మూడు ఆప్షన్లలో ఏదైనా ఒక్కటిని మీరు రోజూ అలవాటు చేసుకున్నా, మీకు అవసరమైన 1.6 గ్రాముల ఒమేగా–3 ఫ్యాట్ సులభంగా అందిపోతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పు తీసుకొస్తాయి.
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!