బలహీనంగా ఉన్న ఎముకలు బలంగా అవ్వాలంటే…..

బలహీనంగా ఉన్న ఎముకలు బలంగా అవ్వాలంటే…..

ఇంట్లోనే సులభంగా పాలకూరను ఎలా పెంచుకోవచ్చో, అలాగే ఆ పాలకూరను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.డాక్టర్ గారు చెప్పినట్లుగా, ఇంట్లో చిన్న ట్రే లేదా చిన్న గార్డెన్ స్పేస్ ఉన్నా సరే సులభంగా పెరిగే మొక్కలు చాలానే ఉన్నాయి. వీట్‌గ్రాస్‌, కొత్తిమీర, పుదీనా లాంటివి ఎలా ఈజీగా పెరుగుతాయో, అదే విధంగా ఆకుకూరల్లో పాలకూరను కూడా ఎవరికైనా సులభంగా పెంచుకోవచ్చు.

ఇప్పుడు పాలకూర తినడం వల్ల వచ్చే లాభాల గురించి చూద్దాం. నాచురోపతి విధానంలో ఎక్కువగా ఉపయోగించే ఆకుకూరల్లో మొదటి స్థానంలో ఉండేది పాలకూరే. ఎందుకంటే, మిగతా ఆకుకూరలతో పోలిస్తే ఇందులో సహజంగా ఉండే రుచి వల్ల చప్పదనం తగ్గి, ఉప్పు తక్కువ వేసినా సరిపోతుంది. అందుకే పాలకూరను జ్యూసుల్లో, బిర్యానీ, పులావ్‌, గ్రేవీ కూరలు, స్నాక్స్‌, టిఫిన్స్‌ ఇలా అనేక వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు.


నరాల బలహీనత, కాళ్లలో వణుకు, Stress అన్నిటినీ తగ్గించే బ్రహ్మాస్త్రం ఇది.

సాధారణంగా మార్కెట్‌లో దొరికే పాలకూరపై ఇతర ఆకుకూరలతో పోలిస్తే ఎక్కువగా మందులు వాడుతుంటారు. అలాంటప్పుడు మనం ఇంట్లోనే పాలకూరను పండించుకుంటే, ఎలాంటి రసాయనాల భయం లేకుండా నిశ్చింతగా వాడుకోవచ్చు. పిండివంటల్లో కలపడం నుంచి కూరల్లో వేసే వరకు అన్నిట్లోనూ స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు.

పాలకూర పెంచడానికి ఎక్కువ మట్టి అవసరం లేదు. దీని వేర్లు లోతుగా వెళ్లవు కాబట్టి తక్కువ లోతు ఉన్న ట్రే లేదా కుండ చాలు. తక్కువ రోజుల్లోనే కోతకు సిద్ధమవుతుంది. ఆకులు కొద్దిగా కోసుకుంటూ ఉంటే, మళ్లీ కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. ఇలా ఇంట్లోనే పండించుకుంటే పాలకూర వినియోగం కూడా సహజంగానే పెరుగుతుంది.

సంక్రాంతికి రైతులకు గుడ్‌న్యూస్: తెలంగాణలో మళ్లీ ప్రారంభమవుతున్న రైతు యాంత్రికరణ పథకం

ఆరోగ్యపరంగా చూస్తే, పాలకూర ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ K సమృద్ధిగా ఉంటుంది. అలాగే రక్తనాళాలు విస్తరించడానికి అవసరమైన నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచే నైట్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

పాలకూర వంటల్లో ఎక్కువగా వాడితే ఉప్పు అవసరం తగ్గుతుంది. అంటే ఉప్పు పరిమాణం తగ్గడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనం రక్షణ పొందవచ్చు. ఈ విధంగా పాలకూర మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.కాబట్టి మన ఫాలోవర్స్ అందరూ ఇంట్లోనే పాలకూరను సులభంగా పెంచుకొని, రోజువారీ ఆహారంలో వాడుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు.

బియ్యం కడిగిన నీళ్లు మీ చర్మానికి వాడుతున్నారా?

టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *