చాలామంది ప్రకృతి వైద్యం అనగానే అది రిటైర్ అయినవారికి లేదా వయసు పైబడిన తర్వాత మాత్రమే అవసరమయ్యే విధానం అని భావిస్తారు. కానీ నిజానికి పెద్దవయసులో ఆరోగ్యంగా, చురుకుగా, స్వతంత్రంగా జీవించాలంటే ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిలో సరైన మార్పులు తప్పనిసరి. ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత శరీర జీర్ణక్రియ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. అందువల్ల సాయంత్రం భోజనం చాలా ఆలస్యంగా చేయడం మంచిది కాదు. రాత్రి జీర్ణక్రియ మరింత మందగిస్తుందనే కారణంతో సాయంత్రం 6 నుంచి 6:30 లోపు భోజనం ముగించాలి.
‘బూకీ’ ఈవెంట్‌లో ఆసక్తికర చర్చ: తొందరపడి పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దన్న మంచు లక్ష్మీ
ప్రతిరోజూ నానబెట్టిన ఎండు విత్తనాలు తీసుకోవడం పెద్దలకి ఎంతో మేలు చేస్తుంది. వాల్‌నట్స్, పిస్తా, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వంటి విత్తనాలు విటమిన్ E, మంచి కొవ్వులు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి మెమరీ తగ్గకుండా కాపాడటమే కాకుండా శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. రెండు మూడు రకాల పండ్లతో పాటు ఈ నానబెట్టిన విత్తనాలను తీసుకోవచ్చు. షుగర్ ఉన్నవారు కూడా దానిమ్మ, జామ, రేగిపండ్లు వంటి తక్కువ గ్లైసెమిక్ పండ్లు పరిమితంగా తీసుకోవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.
డిన్నర్ చేసిన తర్వాత కనీసం అరగంట మెల్లగా నడక చేయడం అలవాటు చేసుకోవాలి. భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం జీర్ణక్రియకు హానికరం. మధ్యాహ్న భోజనంలో రెండు మూడు స్పూన్ల చియా గింజలు చేర్చడం చాలా ఉపయోగకరం. ముందుగా అరగంట నానబెట్టి కూరలో, మజ్జిగలో లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు. ఇవి ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా కలిగి ఉండి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, మంచి కొలెస్ట్రాల్ పెంచటంలో సహాయపడతాయి. మలబద్ధకం రాకుండా కాపాడతాయి.
ముక్కకుండ మోషన్ కి వెళ్లే సింపుల్ ట్రిక్.
ఆహారంలో 60–70% కూరగాయలు, 30–40% మాత్రమే ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. పొట్టు తీసని ధాన్యాలు, మిల్లెట్స్ వంటివి మంచివి. భోజనంతో పాటు ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. భోజనం తర్వాత కొద్దిగా నువ్వులు తీసుకోవడం ఎముకల బలానికి మంచిది. తేలికగా జీర్ణమయ్యే పెసరపప్పు, రాజ్మా, బటానీలు వంటి ప్రోటీన్ పదార్థాలు కూడా ఆహారంలో భాగం కావాలి.
ఉదయం ఎక్కువ ఆకలి లేకపోతే మొలకలగట్టిన రాగి పిండి జావను తాటి బెల్లం లేదా ఖర్జూరం పేస్ట్‌తో తీసుకోవచ్చు. షుగర్ ఉన్నవారు తీపి లేకుండా తీసుకోవడం మంచిది. ఇది బలం, ఎముకల పుష్టి, జీర్ణశక్తికి సహాయపడుతుంది.
సముద్ర గర్భంలో శ్రీరాముని మరో రాజ్యం.
పెద్దవయసులో మూడు ప్రధాన భోజనాలు మాత్రమే తీసుకోవడం మంచిది. తరచూ చిన్న చిన్నగా తినడం వల్ల అరుగుదల తగ్గి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రోజూ తగినంత నీరు తాగడం, సకాలంలో మల విసర్జన, నడక వంటి మంచి అలవాట్లు పాటిస్తే రిటైర్ అయిన తర్వాత కూడా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు.
సాంబార్ వడ తింటున్నారా? అయితే ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి.