బియ్యం కడిగిన నీళ్లు మీ చర్మానికి వాడుతున్నారా?

బియ్యం కడిగిన నీళ్లు మీ చర్మానికి వాడుతున్నారా?

చర్మాన్ని క్రమం తప్పకుండా మర్దన చేయడం వల్ల స్కిన్ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యంగా కనిపించడమే కాకుండా సహజమైన మెరుపు పెరుగుతుంది. ముసలితనం త్వరగా రాకుండా, చర్మం సాగిపోకుండా టైట్‌గా ఉండేందుకు మసాజ్ ఎంతో సహాయపడుతుంది. డ్రైనెస్, ఇరిటేషన్ వంటి సమస్యలు తగ్గి చర్మం మృదువుగా ఉంటుంది.

సాధారణంగా మసాజ్ అంటే ఆయిల్స్‌తోనే చేస్తారని మనకు తెలుసు. కానీ రోజూ అన్నం వండేటప్పుడు బియ్యం ఉడికిన తర్వాత మిగిలే గంజిని మనం సాధారణంగా పారబోస్తుంటాం. అదే గంజిని చర్మంపై రాసుకుని మర్దన చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. గంజిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు స్కిన్ టోన్, స్కిన్ కండిషన్ మెరుగుపడటానికి బాగా ఉపయోగపడతాయి.

శక్తి సామర్థ్యాన్ని తగ్గించే ఆహారం ఇది.

గంజిలో సహజంగా ఇనోసిటాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది చర్మం లోపల ఉన్న కొలాజన్ మెష్ బలంగా ఉండేలా చేస్తుంది. కొలాజన్ తెగిపోకుండా, చర్మం ఆరోగ్యంగా ఫర్మ్‌గా ఉండేందుకు ఇది సహకరిస్తుంది. అలాగే గంజిలో ఉండే ఎలాంటోయిన్ అనే సమ్మేళనం స్కిన్ టోన్ మెరుగుపడటానికి దోహదపడుతుంది. ఈ రెండు కారణాల వల్ల గంజి మర్దన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

గంజితో మసాజ్ చేయడం వల్ల చర్మం లూజ్ కాకుండా టైట్‌గా ఉంటుంది, ముడతలు తగ్గుతాయి, స్కిన్ పోర్స్ అనవసరంగా ఓపెన్ కావడం తగ్గుతుంది. అంతేకాదు, మసాజ్ సమయంలో శరీరంలో “హ్యాపీ హార్మోన్లు” పెరిగి, స్ట్రెస్‌కు కారణమయ్యే హార్మోన్లు తగ్గుతాయి.

టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.

ఆయిల్‌తో పోలిస్తే గంజికి సహజంగా జిగురు గుణం ఉంటుంది. అందువల్ల చేతి కదలికలకు సరైన ఫ్రిక్షన్ లభిస్తుంది. ఆయిల్ మసాజ్ తర్వాత స్నానం చేయడం కాస్త కష్టంగా అనిపించినా, గంజితో అలా ఇబ్బంది ఉండదు. సులభంగా కడిగేయవచ్చు.

మసాజ్ చేయడం వల్ల చర్మానికి రక్తప్రసరణ గణనీయంగా పెరుగుతుంది. సాధారణంగా చర్మానికి బ్లడ్ సప్లై తక్కువగా ఉంటుంది. కానీ మర్దన వల్ల చర్మంపై రాపిడి ఏర్పడి, రక్తనాళాలు విస్తరిస్తాయి. ఫలితంగా రక్తప్రసరణ రెట్టింపు అవుతుంది. దీనివల్ల చర్మ కణాలకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. వ్యర్థ పదార్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి.

చలికాలంలో ఇమ్మ్యూనిటి ని అమాంతం పెంచే డ్రింక్ ఇది.

అలాగే చర్మం కింద ఉండే మసిల్స్‌కు కూడా రక్తప్రసరణ పెరుగుతుంది. మసిల్స్ టోన్ మెరుగుపడటం వల్ల చర్మం సాగిపోకుండా బిగుతుగా ఉంటుంది. లోపల ఉన్న కొలాజన్ బ్యాండ్స్ బలంగా ఉండేందుకు కూడా మసాజ్ ఉపయోగపడుతుంది.

ఇంకొక ముఖ్యమైన లాభం ఏమిటంటే, మసాజ్ ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఈ హార్మోన్ ఎక్కువైతే కొలాజన్ బ్రేక్‌డౌన్ అయి ముడతలు పెరిగే అవకాశం ఉంటుంది. గంజి మర్దన వల్ల కార్టిసాల్ తగ్గి, చర్మం హైడ్రేట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది.

పాతాళలోకం వినడమే గానీ ఎప్పుడైనా చూశారా?వైరల్ వీడియోలో బోరుబావి సాహసం.

మసాజ్ చేస్తున్నప్పుడు చాలామందికి ఎంతో హాయిగా అనిపించి రిలాక్సేషన్ కలుగుతుంది. కొందరికి నిద్ర కూడా వచ్చేస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గిన కొద్దీ చర్మ ఆరోగ్యం మెరుగుపడటం సహజం.

నేచురోపతి విధానాల్లో మసాజ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పార్షియల్ మసాజ్, ఫుల్ బాడీ మసాజ్, డీప్ టిష్యూ, స్వీడిష్ మసాజ్ వంటి అనేక పద్ధతులు చర్మానికి, శరీరానికి మేలు చేస్తాయి. పూర్వకాలం నుంచి ఉన్న గంజి మర్దన విధానం ఈ రోజుల్లో కూడా నేచురోపతి కేంద్రాలు, రిసార్ట్స్‌లో మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తోంది.

చలికాలంలో నీళ్లు తక్కువ తాగితే వచ్చే సమస్యలు – పరిష్కారాలు

ఈ గంజి మర్దన వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలుసుకుని, మీరు కూడా ఇంట్లో సులభంగా ప్రయత్నించవచ్చు. సహజమైన పద్ధతులతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
నమస్కారం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *