కిడ్నీలకు హాని చేసే అలవాట్లు – ఆహారాలు

కిడ్నీలకు హాని చేసే అలవాట్లు – ఆహారాలు

ప్రతి అవయవానికి దానిని దెబ్బతీసే కొన్ని అలవాట్లు, ఆహారాలు ఉంటాయి. అదే విధంగా కిడ్నీలకు కూడా కొన్ని అలవాట్లు, ఆహారాలు తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. ఈ మధ్యకాలంలో కిడ్నీ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. 100 మందిలో సుమారు 35% మందికి డయాబెటిస్ ఉండగా, డయాబెటిస్ ఉన్నవారిలో 40% మందికి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ – ఎందుకు వస్తాయి? ఎలా తగ్గించుకోవచ్చు?

కిడ్నీ దెబ్బతింటే కనిపించే లక్షణాలు:

  • మూత్రంలో ప్రోటీన్, క్రియాటినిన్, యూరియా, యూరిక్ యాసిడ్ పెరగడం
  • మూత్రం పోసిన తర్వాత కమోడ్‌లో బుడగలు కనిపించడం
  • కాళ్లవాపు, ముఖం ఉబ్బటం
  • కిడ్నీలో రాళ్లు, ఆ వల్ల వచ్చే నొప్పులు
  • రక్త పరీక్షల్లో క్రియాటినిన్, యూరియా పెరగడం

ఇవి కిడ్నీ ఫిల్టరేషన్ సరిగా లేకపోవడానికి సంకేతాలు.

ఎర్రకోట సమీపంలో కారు పేలుడు – దర్యాప్తులో కీలక మలుపు.

కిడ్నీలు పాడుచేసే అలవాట్లు:

1. ఎక్కువ కాఫీ తాగడం

కాఫీలో ఉండే కేఫిన్ నేరుగా కిడ్నీ ఫిల్ట్రేషన్ యూనిట్స్ అయిన‌నెఫ్రాన్స్‌ను దెబ్బతీస్తుంది.

2. కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్

అన్నింటిలోనూ కేఫిన్ ఉంటుంది. కేఫిన్ ఎక్కువైతే కిడ్నీలపై భారీ ఒత్తిడి పడుతుంది.

3. చాక్లెట్లు, బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్

ఇవన్నీ కూడా అదనపు కేఫిన్ కలిగి ఉంటాయి.

4. ఆల్కహాల్

ఆల్కహాల్ కిడ్నీ పనితీరును నెమ్మదించడమే కాకుండా, శరీరంలో డీహైడ్రేషన్ పెంచి కిడ్నీ సమస్యలను వేగంగా పెంచుతుంది.

కంటి చూపు మెరుగుపరుచుకునే నాలుగు రహస్యాలు – సహజంగా చూపును కాపాడుకోండి

కిడ్నీలను దెబ్బతీసే ఆహారాలు:

1. వైట్ పాయిజన్స్ – ఉప్పు & పంచదార

ఉప్పు (Salt)

  • మనం బయట నుంచి తినే ఉప్పు అసలు బాడీకి అవసరం లేదు.
  • రోజూ అధికంగా ఉప్పు తీసుకోవడం వలన రక్తం చిక్కబడుతుంది, బీపీ పెరుగుతుంది.
  • బీపీ పెరిగితే కిడ్నీలకు వెళ్ళే రక్తప్రవాహం తగ్గి ఫిల్టరేషన్ దెబ్బతింటుంది.
    అందుకే కిడ్నీ డామేజ్ ఉన్నపుడు డాక్టర్లు జీరో సాల్ట్ డైట్ సూచిస్తారు.

పంచదార

  • షుగర్ అణువులు రక్తనాళాల గోడలకు అంటిపడతాయి.
  • కిడ్నీలోని ఫిల్టర్స్ clogged అవుతాయి.
  • అందుకే షుగర్ పేషెంట్స్‌కు కిడ్నీ డ్యామేజ్ ఎక్కువగా కనిపిస్తుంది.

2. నాన్-వెజ్

అనిమల్ ప్రోటీన్ పిండిపోయినపుడు యూరిక్ యాసిడ్, యూరియా, క్రియాటినిన్ వంటి వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి.
ఇవన్నీ కిడ్నీలకు పెద్ద భారమవుతాయి.
అందుకే:

  • కిడ్నీ సమస్యలున్నవారికి
  • యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారికి

డాక్టర్లు ముందుగా నాన్ వెజ్ పూర్తిగా మానేయమని చెప్తారు.

చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్‌చెరులో విషాద ఘటన.

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు:

1. ఉప్పు చాలా తక్కువగా లేదా పూర్తిగా మానేయాలి

  • ఉప్పు తగ్గితే కిడ్నీలు తక్కువ ఓత్తిడితో పనిచేస్తాయి
  • క్రియాటినిన్ స్థాయి తగ్గుతుంది
  • డయాలిసిస్‌కి వెళ్లే ప్రమాదం తగ్గుతుంది

2. సింపుల్, రా ఫుడ్ ఎక్కువగా తినాలి

  • వండిన ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది
  • ప్రకృతి సిద్ధమైన ఆహారాల్లో సహజ ఉప్పు, సహజ నీరు ఎక్కువగా ఉంటుంది
  • ఇవి కిడ్నీలకు హాని చేయవు

3. రోజుకు కనీసం 3–4 లీటర్ల నీరు తాగాలి

  • నీళ్లు ఎక్కువగా తాగితే
    • ఎక్స్‌సెస్ సాల్ట్ యూరిన్ ద్వారా సులువుగా బయటకు వెళ్తుంది
    • కిడ్నీలపై లోడ్ తగ్గుతుంది

4. నాన్ వెజ్, పచ్చళ్ళు, ఆవకాయలు, అప్పడాలు, వడియాలు, రుమా మిరపకాయలు మానేయాలి

ఇవి హై సాల్ట్ డైట్, కిడ్నీలకు అత్యంత హానికరం.

మగవారికి వృషణాల భాగంలో దురద, ఇన్ఫెక్షన్ సమస్యలు – కారణాలు మరియు సహజ పరిష్కారాలు.

కిడ్నీ డామేజ్ ఉన్నవారికి ముఖ్యమైన విషయం:

క్రియాటినిన్ 2–3 వరకు ఉన్నవారు ఉప్పు లేకుండా, రా ఫుడ్ ఎక్కువగా తింటే:

  • 2–3 నెలల్లో 1.2 – 1.3 వరకు తగ్గే అవకాశం ఉంది
  • మళ్ళీ నార్మల్ లైఫ్‌కి వచ్చెచ్చు

కానీ డయాలిసిస్‌ స్టేజ్‌లోకి వెళ్లాక తిరిగి రివర్స్ కావడం చాలా కష్టం.

అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.

 గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!

కిడ్నీలను కాపాడుకోవాలంటే

  • ఉప్పు తగ్గించాలి
  • పంచదార తగ్గించాలి
  • నాన్ వెజ్ మానేయాలి
  • నీళ్లు ఎక్కువగా తాగాలి
  • కేఫిన్, ఆల్కహాల్ దూరంగా ఉంచాలి

డాక్టర్ గారు చెప్పిన సూచనలు పాటిస్తే
కిడ్నీ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు, ఉన్నవారు కూడా మెరుగుపడవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *