ఉచితాలు ఆఫర్లు డిస్కౌంట్లు అనే పదాలు ఎంత పవర్ఫుల్ అంటే అడవిలో ఆఫర్ పెట్టినా పోతారు అర్ధరాత్రి నిద్ర కాసి లైన్ కట్టమన్నా కడతారు కొంతమంది జనాలు. జనాలకున్న ఆఫర్ వీక్నెస్ ను పసిగట్టి మంచిగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. అయితే మెదక్ జిల్లా నర్సాపూర్లో ఒక బట్టల షాప్ అతను రెండు అంటే రెండు రూపాయలకే భూషోట ఆఫర్ పెట్టిండట.
మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉండే గీ చేతన్ మెన్స్ వేర్ బట్టల షాప్ ఆయన రెండు రూపాయలకే షర్ట్ అని ఆఫర్ పెట్టిండట అయితే ఆఫర్స్ కింద కంపెనీలు కండిషన్స్ అప్లై అని పెట్టినట్టు ఈ ఆఫర్ 10 నిమిషాలు మాత్రమే అని కండిషన్ పెట్టిండట మనోడు… అయితే ఆ కండిషన్ చూసుకోకుండా వందల మంది ఎగబడ్డారు ఆఫర్ కోసం.
ఇక చూసుకోర్రి నేను 10 నిమిషాలనే పెట్టిన నాదేం తప్పు లేదు టైం అయిపోయింది అని చెప్పి షటర్ గుంచి అవతల పడ్డాడు దుక్కునపోడు ఇంత మోసం చేస్తాడా ఆఫర్ పెట్టి బకరాళం చేస్తాడా ఇంతమందిని అని షటర్ గుంచిన ఆడికెళ్లి పోతలేరు వచ్చినోళ్ళు లాస్ట్ కు ముచ్చట పోలీసోల దాకా వెళితే వచ్చి ఎక్కడోళ్ళని అక్కడే వెళ్లగొట్టినరు.
నాకు తెలిసిన మంత్రం పని చేస్తదా లేదా అని కొత్తగా మంత్రాలు నేర్చుకున్నోడు ప్రయోగం చేసి చూసినట్టు ఈ షాపు వాడు కూడా Instagram లో ఆఫర్ పెడితే వస్తారా లేదా అని చూసిండేమో గింత పని అయితదని ఎక్స్పెక్ట్ చేయలేనట్టున్నాడు. మరి అట్లుంటది సోషల్ మీడియాల ప్రభావం జనాల మీద, అది కరెక్టేనా కాదా? కండిషన్లు పెడుతున్నారా అని చూసుకోకుండా ఎగబడుడు దుక్కునంలోకి పోయినక మోసపోవుడు అయితుంటది. ఆషాడంలో షాపింగ్ మాల్లో పెట్టే ఆఫర్లు కూడా గిట్నే ఉంటాయి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb