మనందరం ఈ మధ్య మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. నిజంగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే, మన హ్యాపీ హార్మోన్లలో ఒకటైన డోపామిన్ స్థాయి సరిగా ఉండాలి. జీవనశైలిలో ఒత్తిడి పెరగడం, సంతోషంగా గడిపే సమయం తగ్గిపోవడం వంటివాటితో డోపామిన్ తగ్గిపోతుంది. అలాగే స్ట్రెస్ ఎక్కువైతే కాటిజాల్ అనే బ్యాడ్ హార్మోన్ పెరిగి, మానసికంగా మాత్రమే కాదు శారీరకంగా కూడా అనేక సమస్యలు కలిగిస్తుంది.
మీకు French Fries అంటే ఇష్టమా ?
ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి సహజంగా డోపామిన్ అందించే ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. అలాంటి సహజ ఎల్-డోపా ఎక్కువగా ఉండే ఏకైక ఆహారం వెల్వెట్ బీన్స్ (Mucuna pruriens). 100 గ్రాముల వెల్వెట్ బీన్స్‌లో సుమారు 7 గ్రాముల ఎల్-డోపా సహజంగా లభిస్తుంది — ఇది చాలా గణనీయమైన పరిమాణం.
చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్‌చెరులో విషాద ఘటన.
వెల్వెట్ బీన్ పొడి ఎలా వాడాలి?
- బీన్స్‌ను లేతగా వేయించి పౌడర్ చేసుకోవాలి.
- రోజుకు ఒక టేబుల్ స్పూన్ (5–6 గ్రాములు) ఉదయం తీసుకోవచ్చు.
- తేనెలో కలుపుకుని తినచ్చు, లేదా నీళ్లు/పాలలో కలుపుకొని తాగవచ్చు.
- సాయంత్రం మరోసారి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే మంచిది.
8 గంటలు నిద్ర పోకపోతే ఏమవుతుందో తెలుసా?
ఇలా వాడితే:
- స్ట్రెస్, యాంజైటీ తగ్గుతాయి
- కాటిజాల్ స్థాయులు తగ్గుతాయి
- మెదడు, నరాలకు అవసరమైన డోపామిన్ సహజంగా పెరుగుతుంది
- మనసు ప్రశాంతంగా, శరీరం ఎనర్జీగా ఉంటుంది.
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!
ప్రత్యేకంగా పార్కిన్సన్స్ వంటి సమస్యలతో బాధపడేవారికి డోపామిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి వెల్వెట్ బీన్ పొడిలో ఉండే సహజ ఎల్-డోపా మంచి సహాయం చేస్తుంది.
మొత్తానికి, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, ఆందోళనల నుంచి బయటపడటానికి వెల్వెట్ బీన్ పొడి ఒక మంచి సహజ పరిష్కారం.