Vijay Thalapathy | చిన్న పిట్ట కథ తో మొదలెట్టి… ప్రత్యర్థులపై పంచ్ లు విసిరాడు:
దక్షిణాది లో మరో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో కొత్త పార్టీ విషయం మీ అందరికీ తెల్సినదే.. తమిళనాడు లో జాతీయ , ప్రాంతీయ పార్టీలు బలంగానే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే బలంగా ఉన్న రాజకీయ పార్టీలను ఢీకొట్టేందుకు సినీ నటుడు విజయ్ దళపతి(Vijay Thalapathy) కొత్త పార్టీ ని ఏర్పాటు చేశారు. అయితే ఆయన పార్టీ పేరును తమిళగ వెట్రి కళగం అనే పేరు పెట్టడమే కాకుండా ఆదివారం నాడు మొదటి రాజకీయ సభను నిర్వహించి సఫలం అయ్యాడు.
పార్టీని ప్రారంభించిన ఎనిమిది నెలల తర్వాత టీవీకే మొదటి బహిరంగ సభను విల్లుపురం సమీపంలో నిర్వహించారు. దళపతి ముందుగా కార్యకర్తలకు అభివాదం చేసి అభిమానులు విసిరిన కండువాలను తన మెడలో వేసుకున్నారు. తరువాత పార్టీ జెండాను ఎగరవేసిన విజయ్ దళపతి (Vijay Thalapathy)తన తొలి రాజకీయ ప్రసంగం మొదలుపెట్టరు.. ఆయన పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ తన ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక ప్రజలకు తాను ఏం చేయాలనుకున్నాడో చెప్పే ప్రసంగం మధ్యలోనే ఓ చిన్న కథ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ప్రసంగలో విజయ్ దళపతి నేను మీకు ఒక చిన్న కథ చెప్పనా అని మొదలు పెట్టదు. ఇది ఒక సినిమా ఆడియో లాంచ్ లాగా ప్రేరణ కలిగించే కథ కాదు. అయితే ఒక దేశంలో ఎప్పుడైతే పెద్ద యుద్ధం వచ్చిందో ఆ దేశపు శక్తిమంతమైన నాయకత్వం పోయి ఆ బాధ్యత పచ్చ ఎద్దు చేతుల్లోకి వచ్చింది….అలా రావడం తో ఆ దేశంలోని పెద్ద తలకాయలంతా భయపడ్డారు.ఒక్కసారిగా చిన్న పిల్లవాడు ఆ దేశంలో సైన్యాన్ని నడిపించే బాధ్యతను స్వీకరించాడు. ఇది చూడటానికి యుద్ధభూమిలా ఉంటుందని చెప్పాడు.
ఇలా కథ పేరుతో విమర్శ చేసిన వారి పేరు చెప్పకుండానే పేరు చెప్పకుండానే కొందరు చేసిన కామెంట్స్‌ని వినిపించాడు. నువ్వు చిన్న పిల్లవాడివి. ఇది పెద్ద యుద్ధభూమి. శక్తివంతమైన ప్రత్యర్థులు చాలా మంది ఉంటారు, మైదానంలో వారు కలిసే ప్రతిదీ సాధారణమైనది కాదు, వినండి, ఇది ఆట కాదు, యుద్ధంలో శత్రువులందరినీ అధిగమించి దాడి చేయడం చాలా ముఖ్యం ఆ యుద్ధంలో గెలవడమే ముఖ్యం. యుద్ధానికి నేను రెడీ అంటూ సంకేతం ఇచ్చారు. చివరిలో ఒక డైలాగ్ కూడా విసిరాడు.. కానీ యుద్దంలో బ్యాడ్ బాయ్ సార్ ఆ చిన్న పిల్లవాడు(Vijay Thalapathy) అంటూ కథ రూపంలో ప్రత్యర్ధులపై పంచ్‌లు వేశారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb