ఇప్పుడు చాలామంది ఇలా అనుకుంటున్నారు “మేము టైమ్‌కి భోజనం చేస్తున్నాం, సమయానికి నిద్రపోతున్నాం, వాకింగ్ చేస్తున్నాం, సాధ్యమైనంతవరకు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. అయినా కూడా అనారోగ్యం ఎందుకు వస్తోంది?” అని.
ఇంత జాగ్రత్తలు తీసుకున్నా, ఆరోగ్య సమస్య ఎదురైతే “నేను అవసరం లేకుండా ఇన్ని నియమాలు పాటించానా? ఏది పడితే అది తినే వాళ్లు బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఇలా జరిగింది?” అనే భయం చాలా మందిలో ఉంటుంది.
ఈ నేపథ్యంలో చూస్తే, సంవత్సరాల అనుభవం ఉన్నవారిగా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలో దాదాపు 95 శాతం మంది—పల్లెల్లో అయినా, పట్టణాల్లో అయినా—ఒకే రకమైన ఆహారపు అలవాట్లు, ఒకే జీవనశైలిని అనుసరిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగడం 80–90 శాతం మందిలో కనిపించే అలవాటు.
చలికాలంలో ఇమ్మ్యూనిటి ని అమాంతం పెంచే డ్రింక్ ఇది.
ముందు రోజుల్లో ఉదయాన్నే సద్దన్నం తినే సంప్రదాయం ఉండేది. కాలక్రమేణా టిఫిన్లు వచ్చాయి. మొదట ఒక్కో రకం టిఫిన్ ఉండేది. ఇప్పుడు చూస్తే, ప్రతి టిఫిన్‌కీ ఒక జంట తప్పనిసరి అయింది. ఇడ్లీకి వడ, ఉప్మాకు బజ్జీ, పెసరట్టుకు అల్లం చట్నీ—అందరూ ఒకే సిలబస్ చదివినట్టే సమాధానం చెబుతున్నారు.
మధ్యాహ్నం భోజనంలో తెల్ల అన్నం, పప్పు, పచ్చడి, కొద్దిగా సాంబార్ లేదా రసం. సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో స్నాక్స్ అనే పెద్ద అధ్యాయం మొదలవుతుంది—పకోడీలు, బజ్జీలు, పునుగులు. రాత్రి మళ్లీ అన్నం, కూరలు, బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు, స్వీట్లు, హాట్ ఐటమ్స్. ఇలా రోజంతా అందరూ ఒకే ఆహారపు సిలబస్‌ను ఫాలో అవుతున్నారు.
టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.
ఇలాంటి ఆహారం తీసుకుంటూ రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, ఉదయం లేవగానే కాఫీ తాగడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ధ్యానం చేయకపోవడం—ఇవన్నీ కలిసి స్థూలకాయం, షుగర్, బీపీ, కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె జబ్బులు వంటి వ్యాధులు సాధారణంగా మారుతున్నాయి.
అందరికీ ఒకే రకమైన సమస్యలు రావడానికి కారణం ఇదే—అందరూ ఒకే సిలబస్‌ను అనుసరించడం. దీనికి భిన్నంగా, “అవుట్ ఆఫ్ సిలబస్” అంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార విధానాన్ని పాటిస్తే, మనమే రోగాలను కొనుక్కునే పరిస్థితి ఉండదు. కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా లేదా ప్రమాదాల వల్ల రావచ్చు. కానీ చాలా సమస్యలు మాత్రం మన ఆహారపు అలవాట్ల వల్లే వస్తాయి.
చలికాలంలో నీళ్లు తక్కువ తాగితే వచ్చే సమస్యలు – పరిష్కారాలు
ఇక్కడ చాలామంది అడిగే ప్రశ్న ఇదే—“మేము తినే ఇడ్లీలో మినపప్పు ఉంది, పెసరట్టులో పెసలు ఉన్నాయి కదా! అందులో ప్రోటీన్లు, పోషకాలు ఉండవా?”ఉంటాయి, కానీ అవి సమతుల్యంగా ఉండవు. రుచి ఉంటుంది కానీ శరీరానికి కావాల్సిన పోషక విలువలు తక్కువగా ఉంటాయి. అందుకే ఇలాంటి ఆహారాలను ‘ఫుడ్ డెజర్ట్స్’ అంటారు.
డెజర్ట్ అంటే ఎడారి. ఎడారిలో చెట్లు, మొక్కలు ఉండవు. అలాగే, శరీరానికి అవసరమైన పోషకాలు లేని ఆహారాన్ని ఫుడ్ డెజర్ట్ అంటారు. ఇవి పొట్ట నింపుతాయి, రుచిని ఇస్తాయి, కానీ శరీరాన్ని పోషించవు.
చరిత్ర సృష్టించిన సామాన్యుడు: తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ విజేతగా పవన్ కల్యాణ్.
పాలిష్ చేసిన తెల్ల బియ్యం, రవ్వ, మైదా, కార్న్ ఫ్లోర్, వైట్ షుగర్ వంటి తెల్ల పదార్థాలు—ఇవి ఫుడ్ డెజర్ట్స్‌లోకి వస్తాయి. వీటితో చేసిన ఇడ్లీలు, దోశలు, బజ్జీలు, పకోడీలు—హై కార్బోహైడ్రేట్స్, హై ఫ్యాట్ ఉన్న ఆహారాలే. ఫైబర్, ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
అలాగే మార్కెట్‌లో దొరికే చాక్లెట్లు, బిస్కెట్లు, ప్యాకెట్ జ్యూసులు, కూల్ డ్రింకులు, ఐస్‌క్రీములు, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్—ఇవన్నీ కూడా ఫుడ్ డెజర్ట్స్ కిందే వస్తాయి. ప్యాకెట్‌పై మామిడి బొమ్మ ఉన్నా, లోపల నిజమైన మామిడి పోషకాలు ఉండవు. కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ మాత్రమే ఉంటాయి.
Dark Circles: ఖర్చు లేకుండా కళ్ళ కింద Dark Circles ని ఇలా పోగొట్టుకోవచ్చు.
ఇలా పోషకాలు లేని ఆహారం ఎక్కువగా తినడం వల్ల శరీరానికి సైజు వస్తుంది కానీ బలం ఉండదు. పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. పెద్దవాళ్లలో ఒక సమస్య తర్వాత మరో సమస్య వస్తూనే ఉంటుంది. నిజానికి మనం తినే ఆహారాల్లో దాదాపు 95 శాతం ఫుడ్ డెజర్ట్సే. అందుకే “మూడు పూటలా తింటున్నా కూడా ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి?” అన్న ప్రశ్నకు ఇదే సమాధానం—పొట్ట నిండుతోంది కానీ పోషణ జరగడం లేదు.
పోషకాలు ఉన్న విత్తనాలు, పండ్లు, ఆకుకూరలు, సహజ ఆహారాలు కొంచెం ఖరీదుగా అనిపించవచ్చు. కానీ రోడ్డుపక్కన దొరికే కూల్ డ్రింకులు, బజ్జీలు, బోండాలు చవగ్గా కనిపిస్తాయి. అందుబాటులో ఉన్నవి కావడంతో అవే ఎక్కువగా తింటున్నారు. చిన్నప్పటి నుంచి అలవాటైన ఆహారమే వ్యసనంగా మారింది.
సోషల్ మీడియా పరిచయాలు మరో విషాదానికి దారి తీశాయి.
నాలుక రుచికోసం శరీరాన్ని తాకట్టు పెట్టి, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే పెద్ద సమస్యల నుంచి బయటపడవచ్చు. కానీ అలవాట్లు మారకపోవడమే అసలు సమస్య.