Wrong UPI Payment | మీరు రాంగ్ యూపీఐ ఐడికి డబ్బు పంపారా? ఈ చిన్న పనితో మీ డబ్బు తిరిగి పొందవచ్చు.
Wrong UPI Payment: ప్రస్తుత జనరేషన్ లో UPI పేమెంట్ తెలియని వ్యక్తి ఉండడు అని చెప్పవచ్చు. ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ కనబడుతుంది. ఏమి కొన్న ఫోన్ పే, గూగుల్ పే, పేటియం అంటూ UPI పేమెంట్స్ తెగ చేస్తున్నారు. అయితే కొంతమంది UPI పేమెంట్ చేసేవాళ్లు అనుకోకుండా రాంగ్(Wrong UPI Payment) యూపీఐకి డబ్బులు పంపి చాలా ఇబ్బందులుపడ్డవారు ఉన్నారు. మీరు రాంగ్ UPI ఐడికి డబ్బులు పంపితే వాటిని తిరిగి 48 గంటల్లోపు డబ్బును పొందొచ్చు.
మీరు మరియు మీ నుండి డబ్బు పొందిన వ్యక్తి ఇద్దరూ ఒకే బ్యాంక్‌ని ఉపయోగిస్తుంటే ఈ రీఫండ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. వేర్వేరు బ్యాంకుల మధ్య లావాదేవీలు అయితే మాత్రం కొంత సమయం పట్టవచ్చు. రాంగ్(Wrong UPI Payment) నెంబర్ కి డబ్బులు పంపడం సహజమే ఐనప్పటికి తిరిగి వాటిని పొందడం ఎలానో చాలా మందికి తెలియదు. ఒకవేళ రాంగ్ నెంబర్ కి డబ్బులు వెళ్తే ఏం చేయాలో చూద్దాం.
మీకు తెలియని వ్యక్తికి డబ్బు పంపితే.. ఆ వ్యక్తి మీకు సహకరించకుంటే లేదా మీరు వారిని సంప్రదించలేకపోతే.. మీ యూపీఐ యాప్ కస్టమర్ సపోర్ట్‌కి లావాదేవీని రిపోర్టు చేయాలి. లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలు, సాక్ష్యాలను వారితో షేర్ చేయండి. వాపసు ప్రక్రియ కోసం మీకు సాయపడేందుకు సాధ్యపడుతుంది. మీరు కస్టమర్ సపోర్ట్ ద్వారా సమస్యను పరిష్కరించలేకపోతే.. మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యను మరింత పెంచవచ్చు.
అన్ని లావాదేవీల వివరాలను, ఏవైనా సహాయక సాక్ష్యాలను వారికి అందించండి. వారు సమస్యను (Wrong UPI Payment)మరింత లోతుగా పరిశీలిస్తారు.మీ బ్యాంక్ నుండి సాయం పొందండి, పొరపాటున జరిగిన లావాదేవీ గురించి వీలైనంత త్వరగా మీ బ్యాంకుకు తెలియజేయండి. వారికి అవసరమైన అన్ని వివరాలను అందించండి. డబ్బును రికవరీ చేసేందుకు వారు ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. సాయం కోసం టోల్-ఫ్రీ నంబర్ 1800-120-1740కి కూడా కాల్ చేయవచ్చు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb