గర్భధారణ సమస్యలకు అద్భుతమైన సహజ పరిష్కారం.

గర్భధారణ సమస్యలకు అద్భుతమైన సహజ పరిష్కారం.

ఇప్పటి రోజుల్లో లైఫ్‌స్టైల్, స్ట్రెస్, హార్మోన్ అసమతుల్యతల కారణంగా ప్రతి ఆరు జంటల్లో ఒక జంటకు సంతాన సమస్యలు కనిపిస్తున్నాయని WHO ప్రకటించింది. ఇప్పుడు ఈ శాతం ఇంకా పెరిగి ఉండవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎల్‌హెచ్ (LH), ఎఫ్‌ఎస్‌హెచ్ (FSH) హార్మోన్లను సహజంగా పెంచి గర్భధారణ సులభతరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడే ఒక విత్తనం ఉంది — అదే Velvet Beans (ముకొన్నా మూలుగోపా / కపికచ్ఛూ).

మంచం ఎక్కగానే మంచి నిద్ర పట్టాలంటే ఇలా చేయండి.

వెల్వెట్ బీన్స్ వల్ల లభించే ప్రయోజనాలు

వెల్వెట్ బీన్స్‌లో సహజసిద్ధంగా ఉండే L-Dopa డొపమిన్ హార్మోన్‌గా మారి

  • హ్యాపీనెస్‌ పెంచుతుంది
  • స్ట్రెస్‌ తగ్గిస్తుంది
  • LH, FSH హార్మోన్లను ప్రోత్సహిస్తుంది
  • మగవారిలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతుంది
  • స్పెర్మ్ క్వాలిటీ మరియు మొటిలిటీని మెరుగుపరుస్తుంది

ఇది సైంటిఫిక్‌గాను నిరూపితమైంది.

లక్నో CSM మెడికల్ యూనివర్సిటీ చేసిన పరిశోధన:

75 మంది మీద మూడు నెలలు చేసిన స్టడీలో వెల్వెట్ బీన్స్ వాడిన తర్వాత వచ్చిన ఫలితాలు ఇలా ఉన్నాయి:

చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్‌చెరులో విషాద ఘటన.

1. టెస్టోస్టెరాన్ పెరుగుదల

  • నార్మల్ ఉన్నవారిలో: 27% పెరుగుదల
  • లో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారిలో: 39% పెరుగుదల
  • బ్యాడ్ మొటిలిటీ ఉన్నవారిలో: 38% పెరుగుదల

2. కార్టిజాల్ (స్ట్రెస్ హార్మోన్) తగ్గుదల

స్ట్రెస్ ఎక్కువైతే టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది, స్పెర్మ్ క్వాలిటీ పడిపోతుంది.
వెల్వెట్ బీన్స్ దీనిని అద్భుతంగా నియంత్రిస్తుంది.

  • నార్మల్ వ్యక్తుల్లో: 27% తగ్గుదల
  • లో స్పెర్మ్ ఉన్నవారిలో: 81% తగ్గుదల
  • బ్యాడ్ మొటిలిటీ ఉన్నవారిలో: 55% తగ్గుదల

3. ల్యూటినైజింగ్ హార్మోన్ (LH) పెరుగుదల

  • నార్మల్ వ్యక్తుల్లో: 23% పెరుగుదల
  • లో స్పెర్మ్ కౌంట్ ఉన్నవారిలో: 41% పెరుగుదల
  • బ్యాడ్ మొటిలిటీ ఉన్నవారిలో: 40% పెరుగుదల

 గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!

LH పెరగడం వల్ల

  • మగవారిలో లేడిగ్ సెల్స్ యాక్టివ్ అవుతాయి
  • టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరుగుతుంది
  • వీర్యకణాల క్వాలిటీ మెరుగవుతుంది

4. ఫోలికల్ స్టిములేటింగ్ హార్మోన్ (FSH) పెరుగుదల

ఆడవారిలో

  • ఎగ్స్ తయారీ, ఎగ్ క్వాలిటీ మెరుగుదలకు కీలకమైన హార్మోన్ ఇది.

ఫలితాలు:

  • నార్మల్ వ్యక్తుల్లో: 18% పెరుగుదల
  • తక్కువ FSH ఉన్నవారిలో: 41% పెరుగుదల
  • బ్యాడ్ మొటిలిటీ ఉన్న మగవారిలో: 32% పెరుగుదల

అదనపు ప్రయోజనాలు – మగవారికి సూపర్ గుడ్ న్యూస్:

వెల్వెట్ బీన్స్ లివర్‌ని యాక్టివేట్ చేసి

  • గ్లుటథయోన్
  • సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్
  • కాటలేజ్

అనే శరీరం శుభ్రపరిచే/ డిటాక్సిఫై చేసే ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచుతుంది.
అవి స్పెర్మ్ DNA డ్యామేజ్‌ని తగ్గించి ఆరోగ్యకరమైన DNA నిర్మాణాన్ని కాపాడుతాయి.


వెల్వెట్ బీన్స్ వాడే విధానం:

  • రోజుకు 5 గ్రాములు
  • తేలికగా వేయించి పొడి చేసుకోవాలి
  • తేనెతో కలిపి తీసుకోవచ్చు
  • లేదా నీళ్లలో కలిపి తాగవచ్చు

దీన్ని ఇలా రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరానికి కావలసిన హ్యాపీ హార్మోన్ Dopamine అందుతుంది.
ఆడవారికీ, మగవారికీ గర్భధారణ సులభతరం కావడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

వెల్వెట్ బీన్స్ సహజసిద్ధమైన, సైంటిఫిక్‌గా నిరూపితమైన అద్భుత ఔషధధర్మాలు కలిగిన విత్తనం.
గర్భధారణ సమస్యలు ఉన్న జంటలు, హార్మోన్ అసమతుల్యతలతో బాధపడే వారు దీన్ని నిరంతరం వాడితే ఎంతో ప్రయోజనం పొందగలరు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *