ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి?

ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి?

ధాన్యాలు మన ఆహారంలో ప్రధానస్థానం దక్కించుకున్నవి. చిన్నప్పటి నుంచే మన తల్లిదండ్రులు వరిధాన్యాలు, చిరుధాన్యాలు తినే అలవాటును పెంచారు. ఇవి అన్నం, రవ్వ, పిండి వంటి విభిన్న రూపాలలో వాడుకుంటూ ఉంటాం. ఇటీవల పాలిష్ చేయని బ్రౌన్ రైస్, ముడి బియ్యం, అలాగే మిల్లెట్స్‌ను కూడా చాలా మంది ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒకరోజు అన్నం, మరొకరోజు మిల్లెట్స్ ఇలా రెండు రకాల ధాన్యాలను మార్పిడి చేసుకుంటూ వాడడం సాధారణమైపోయింది.

8 గంటలు నిద్ర పోకపోతే ఏమవుతుందో తెలుసా?

ఇలా ఏ ధాన్యం తీసుకున్నా — వరిధాన్యమో, చిరుధాన్యమో — 100 గ్రాముల్లో లభించే స్థూల పోషకాలు ఎంత? అన్నది చాలా మందికి తెలియదు. అందుకే ఒక సరళమైన లెక్కను ఇక్కడ అందిస్తున్నాం.

100 గ్రాముల ధాన్యంలో సగటు పోషకాలు

చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్‌చెరులో విషాద ఘటన.

1. శక్తి (Energy):
వరిధాన్యాలు, చిరుధాన్యాలు ఏవి తీసుకున్నా సగటుగా 340 కిలో క్యాలరీలు లభిస్తాయి. మీరు ఏ రకం వాడినా ఇదే ఉంచుకోవచ్చు.

2. కార్బోహైడ్రేట్స్ (Carbohydrates):
100 గ్రాముల ధాన్యంలో సగటుగా 68 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
అన్నం తిన్నా, మిల్లెట్స్ తిన్నా, ఈ పరిమాణం పెద్దగా మారదు.

3. ప్రోటీన్ (Protein):
ఈ ధాన్యాల్లో 100 గ్రాములకు సగటుగా 9.6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
అయితే పాలిష్ చేసిన బియ్యం తింటే ప్రోటీన్‌లో 80% వరకు తవుడు (bran) తో కలిసి తొలగిపోతుంది.
ముడి ధాన్యాలు లేదా బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు ఈ 9.6 గ్రాముల యావరేజ్ ప్రోటీన్ పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది.

గ్యాస్, పొట్ట ఉబ్బరం ఇబ్బంది పెడుతుందా?

4. కొవ్వులు (Fats):
సుమారు 2 గ్రాముల ఫ్యాట్ మాత్రమే లభిస్తుంది — ఇది చాలా తక్కువ మొత్తమని చెప్పాలి.

5. ఫైబర్ (Dietary Fiber):
100 గ్రాముల ధాన్యంలో సగటుగా 6.5 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.

సంఖ్యలన్నీ చెప్పేదేమిటంటే —
మనం వరిధాన్యాలు, చిరుధాన్యాలు, రవ్వలు, పిండులు ఏ రూపంలో వాడుకున్నా, 100 గ్రాములకు వచ్చే ఈ స్థూల పోషకాలు సగటు పరంగా చాలా దగ్గరగానే ఉంటాయి.

 గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!

మీ ఆహారంలో ఏ ధాన్యాన్ని వాడినా ఈ యావరేజ్‌ను తెలుసుకుని ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యానికి మరింత ఉపయోగపడుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *