షుగర్ ఉన్నవారు అన్నం తినాలా? ఏ ధాన్యాలు సురక్షితం – గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా పూర్తి అవగాహన.

షుగర్ ఉన్నవారు అన్నం తినాలా? ఏ ధాన్యాలు సురక్షితం – గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా పూర్తి అవగాహన.

షుగర్ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా అన్నం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందుకే చాలాసార్లు అన్నం మానేసి పుల్కాలు, జొన్న రొట్టెలు లేదా రాగి రొట్టెలు తినాలని సూచిస్తారు. కారణం ఏమిటంటే అన్నం తిన్నప్పుడు పరిమాణం ఎక్కువగా తీసుకుని కూరలు తక్కువగా తింటాం. అదే పుల్కాలు లేదా రొట్టెలు తిన్నప్పుడు ఒకటి రెండు మాత్రమే తీసుకుని కూరలు ఎక్కువగా తింటాం. దీనివల్ల పిండి పదార్థాలు తక్కువగా శరీరంలోకి వెళ్లి రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

అయితే చాలా మంది పెద్దవాళ్లు లేదా శారీరక శ్రమ చేసే వారు “మాకు పుల్కాలు సరిపోవు, అన్నమే కావాలి” అంటారు. అలాంటి వారి కోసం అన్నాన్ని పూర్తిగా మానకుండా, సరైన ధాన్యాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అన్ని ధాన్యాలు ఒకేలా ఉండవు. కొన్ని ధాన్యాలు జీర్ణక్రియలో త్వరగా చక్కెరగా మారి రక్తంలోకి వేగంగా చేరతాయి. వీటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు అంటారు. మెల్లగా జీర్ణమై మెల్లగా చక్కెరగా మారి రక్తంలోకి చేరేవి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు.

Annatto Seeds: కంటి ఆరోగ్యానికి ది బెస్ట్ ఇది.

గ్లైసెమిక్ ఇండెక్స్ 50లోపు ఉంటే లో, 50 నుంచి 70 మధ్య ఉంటే మధ్యస్థం, 70 కంటే ఎక్కువ ఉంటే హైగా పరిగణిస్తారు. పాలిష్ చేయని ముడి బియ్యాలలో బ్లాక్ రైస్ (42–45), ఎర్ర బియ్యం (55), బాస్మతి (50–58), సోనా మసూరి (51–58) లాంటి వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా లేదా మధ్యస్థంగా ఉంటుంది. కానీ తెల్ల బియ్యం, రవ్వ, బియ్యం పిండి, మైదా లాంటివి హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటంతో రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి.

చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్‌.. మహిళ ఏం చేసిందంటే?

మిలెట్స్ అంటే కొర్రలు, సామలు, ఊదలు, అరికలు లాంటివి సాధారణంగా 40 నుంచి 55 మధ్య గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అందుకే షుగర్ ఉన్నవారికి ఇవి బియ్యం కంటే మెరుగైన ఎంపిక. అన్నం తినాలనుకునేవారు కూడా కూరల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు కలపాలి. రాజ్మా, శెనగలు, బఠానీలు, సోయా, వివిధ పప్పులు వంటి వాటిని కూరల్లో వాడితే జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి చక్కెర నియంత్రణలో ఉంటుంది.

ఇలాంటి ఆహార అవగాహనతో మనం షుగర్‌ను నియంత్రించడమే కాకుండా, భవిష్యత్తులో పిల్లలకు ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. శారీరక శ్రమ తక్కువగా చేసే వారు అన్నం తగ్గించి, పుల్కాలు లేదా రొట్టెలు పరిమితంగా తీసుకుని కూరలు ఎక్కువగా తినడం ఇంకా మంచిది. అన్నం పూర్తిగా మానేస్తే మరింత లాభం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Ovarian Cysts:జుట్టు పల్చబడటం, మెడ చుట్టూ నలుపు ఈ లక్షణాలు మీకు ఉన్నాయా?

Viral Video:కోర్టు హాల్‌లో భార్య దాడి.. నవ్వుతూ తప్పించుకున్న భర్త.. వైరల్ వీడియో వెనుక షాకింగ్ కథ!

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *