Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు.
ఢిల్లీలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్(Manmohan Singh)ను కుటుంబ సభ్యులు… హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆయన భాదపడ్డారు. వెంటనే ఆయన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. కానీ, బతికించలేకపోయారు.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్ను మూశారు.మన్మోహన్ సింగ్ మృతికి ప్రధాని మోదీతో సహా రాజకీయ ప్రముఖులందరూ నివాళులు అర్పించారు.
సెప్టెంబర్ 26, 1932న పశ్చిమ పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో(ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) జన్మించిన మన్మోహన్ సింగ్(Manmohan Singh).. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. అలాగే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. సింగ్ ప్రభుత్వ సేవలో సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇందిరా గాంధీ హయాంలో 1971లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. 1976 వరకు ఆ పదవిలో ఉన్నారు.
మన్మోహన్ సింగ్ (Manmohan Singh) 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానిగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఆయన హయాంలో జీడీపీ వృద్ధి రేటు పెరిగింది. అంతేకాదు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ (Manmohan Singh)ఒక మౌనముని. తను చేయాలనుకున్న పనిని సైలంట్‌గా చేసుకుని వెళ్ళిపోయే వ్యక్తిత్వం ఆయనది. మాటల ద్వారా కాకుండా చేత ద్వారా తన పనితనాన్ని అందరికీ చూపించి ప్రశంసలు అందుకున్నారు. ఏనాడు తాను ఇంత చేశాను అని చెప్పుకుని ఎరుగరు. అన్నిటికి మించి అత్యంత నిస్వార్థ నాయకుడిగా అందరికీ గుర్తుండిపోతారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb