Vijayashanthi:రాములమ్మకి తెలంగాణ హోమ్ శాఖ..?
ప్రస్తుతం తెలంగాణ లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు, కాంగ్రెస్ కూటమి నుంచి నలుగురు బరిలో ఉన్నారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పేర్లను కాకుండా కాంగ్రెస్ అధిష్టానం పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఛాన్స్ ఇచ్చింది. (Vijayashanthi)
ఇందులో విజయశాంతి(Vijayashanthi) పేరు కూడా ఉండడం గమనార్హం. దింతో విజయశాంతి ఈసారి ఎమ్మెల్సీ కాబోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి అని చెప్పవచ్చు.. విజయశాంతి టిఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బిజెపికి వెళ్లారు. అయితే బిజెపి రాజకీయాల నచ్చక పోవడం తో కాంగ్రెస్ లోకి వచ్చారు.
కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి(Vijayashanthi) కి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు అధిష్టానం.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు అధిష్టానం. ఇక విజయశాంతి విషయానికి వస్తే సినిమాలలో పోలీస్ పాత్రలలో ఒదిగిపోయారు.
అయితే ఆమెకు నిజ జీవితంలో హోం శాఖ మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అని నెట్టింట చర్చ జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం క్యాబినెట్ విస్తరణ జరగనుంది. క్యాబినెట్ విస్తరణ లో హోం శాఖ మంత్రిగా విజయశాంతి(Vijayashanthi)కి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb