మన వంటింటి చిట్కాల్లో చాలా మందికి ఉపయోగపడే ఒక సహజమైన గ్రే హెయిర్ (తెల్లజుట్టు) నివారణ టిప్ గురించి తెలుసుకుందాం.
ఇప్పటి రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్నపిల్లలు, యువకులు, పెద్దవారు — అందరిలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. చాలా మంది హెయిర్ డైలు వాడుతూ తాత్కాలికంగా జుట్టును నల్లగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ కెమికల్ డైల్స్ వల్ల చర్మం నల్లబడటం, దురద, అలర్జీ, తెల్ల మచ్చలు వంటి అనేక దుష్ప్రభావాలు వస్తుంటాయి.
అందుకే రసాయనాలు కాకుండా సహజ పదార్థాలతో చేసిన ఈ రెమిడీని ప్రయత్నించండి. ఇది చర్మానికి హానీ లేకుండా జుట్టు సహజంగా నల్లబడటానికి సహాయపడుతుంది.
కావలసిన పదార్థాలు:
- బీట్రూట్ రసం – 100 ml
- ఉసిరిక పొడి (Amla Powder) – 2 టీస్పూన్లు (10 గ్రాములు)
- గోరింటాకు పొడి (Henna Powder) – 2 టీస్పూన్లు (10 గ్రాములు)
- నీలి ఆకుపొడి (Indigo Powder) – 2 టీస్పూన్లు (10 గ్రాములు)
తయారీ విధానం:
- బీట్రూట్ గడ్డలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి.
- వాటిని మిక్సీలో వేసి రసం తీయాలి.
- ఆ 100 ml బీట్రూట్ రసంలో ఉసిరిక పొడి, గోరింటాకు పొడి, నీలి ఆకుపొడి వేసి బాగా కలపాలి.
- మిశ్రమం పేస్ట్ లా అయ్యేవరకు కలపాలి.
వాడే విధానం:
- ఈ హెయిర్ ప్యాక్‌ను జుట్టు మొత్తం మరియు తల చర్మానికి సమానంగా రాయాలి.
- రాత్రంతా ఉంచి మరుసటి రోజు కేవలం నీటితో మాత్రమే కడగాలి.
- షాంపూ లేదా సబ్బు వాడకూడదు.
- వారంలో రెండు సార్లు ఇలా చేయడం వల్ల కొన్ని వారాల్లోనే ఫలితాలు కనబడతాయి.
- తర్వాత సమస్య తగ్గిన తర్వాత వారానికి ఒకసారి లేదా పక్షంలో ఒకసారి చేయొచ్చు.
లాభాలు:
- జుట్టు సహజంగా నల్లబడుతుంది.
- హెయిర్ ఫాల్ తగ్గుతుంది.
- తల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
- ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.