Annatto Seeds: కంటి ఆరోగ్యానికి ది బెస్ట్ ఇది.

Annatto Seeds: కంటి ఆరోగ్యానికి ది బెస్ట్ ఇది.

Annatto Seeds: కంటి ఆరోగ్యానికి ది బెస్ట్ ఇది:

ఈరోజు హెల్త్ టిప్‌లో భాగంగా అన్నాటో సీడ్స్ (Annatto Seeds) ను మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.అన్నాటో విత్తనాలను ప్రధానంగా మూడు రకాల లాభాల కోసం ఉపయోగించుకోవచ్చు.


మొదటిది – నేచురోపతి విధానాన్ని ఫాలో అయ్యే వారికి ఇది చాలా ఉపయోగకరం. సాధారణంగా తోటకూరలు, కొబ్బరి నీళ్లలో సోడియం కంటెంట్ 100–200 మి.గ్రా మాత్రమే ఉంటుంది. కానీ అన్నాటో సీడ్స్‌(Annatto Seeds)లో సుమారు 2200 మి.గ్రా వరకు నేచురల్ సోడియం ఉంటుంది. కాబట్టి ఉప్పు వాడకుండా ఆహారం తీసుకునేవారు, ఈ గింజలను కొద్దిగా నానబెట్టి గ్రైండ్ చేసి వంటల్లో కలిపితే సహజంగా సోడియం అందుతుంది.

CM Chandrababu: 6 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్ కు వెళ్ళాను.

రెండవది – ఇవి ఒక మంచి నేచురల్ కలరింగ్ ఏజెంట్ గా ఉపయోగపడతాయి. కుంకుమపువ్వు వేసినప్పుడు పాలలో, కీర్లలో లేదా స్వీట్స్‌లో వచ్చే అందమైన రంగు తెలిసిందే. అదే విధంగా అన్నాటో సీడ్స్‌ను నానబెట్టి వంటల్లో లేదా స్వీట్స్‌లో కలిపితే మంచి ఆరెంజ్-పసుపు రంగు వస్తుంది. కుంకుమపువ్వు ఖరీదైనది కావడంతో, దానికి ప్రత్యామ్నాయంగా అన్నాటో సీడ్స్‌(Annatto Seeds)ను ఉపయోగించుకోవచ్చు.

మూడవది – ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మంచివి. కంటి లోపల ఉండే మాక్యులా అనే భాగం వయసు పెరగడం, డయాబెటిస్ వంటి కారణాల వల్ల డిజనరేట్ అవుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి అన్నాటో సీడ్స్‌లో ఉండే బిక్సిన్, నార్బిక్సిన్, అలాగే ల్యూటిన్, జియాక్సాంతిన్ వంటి పోషకాలు సహాయపడతాయి. ఇవి కంటి రెటినాలోని మాక్యులాను రక్షించి, చూపు బ్లర్ కాకుండా స్పష్టంగా ఉండేందుకు దోహదపడతాయి.

Ovarian Cysts:జుట్టు పల్చబడటం, మెడ చుట్టూ నలుపు ఈ లక్షణాలు మీకు ఉన్నాయా?

ఇలాంటి అన్నాటో సీడ్స్‌(Annatto Seeds)ను ఉపయోగించాలంటే వాటిని నానబెట్టి గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసి వంటల్లో కలపవచ్చు. ఏ రూపంలో వాడినా వంటల ద్వారా తీసుకోవడం మంచిది. అయితే ఇవి నేరుగా గింజలలా నమిలి తినే వాటి కాదు. సరైన విధంగా వాడుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్‌.. మహిళ ఏం చేసిందంటే?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *