తమలపాకులు ఆయుర్వేద వైద్యంలో విశేష స్థానం కలిగి ఉన్నాయి. వీటిలో ఉన్న సహజమైన ఔషధ గుణాలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి.
తమలపాకుల్లో పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్ A, C, B1, B2 పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టును బలంగా, మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. కాల్షియం అధికంగా ఉండటం వలన బలహీనమైన జుట్టుకు బలం చేకూరుతుంది. అదేవిధంగా, జుట్టు రాలిపోవడం తగ్గి, ముతక జుట్టు మృదువుగా మారుతుంది.
Reduces Skin Infections | మొండి చర్మ వ్యాధులను సైతం తగ్గించే ఈ జ్యూస్ ఎలా తయారు చేస్కోవాలో చూడండి.
తమలపాకుల్లో ఉన్న విటమిన్ C జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి ఇన్ఫెక్షన్‌లను నివారిస్తుంది. ఇందులో ఉన్న యాంటీబ్యాక్టీరియల్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రును నియంత్రించి, జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. ఇవి జుట్టును సహజంగా స్ట్రైట్‌గా, పొడవుగా, మందంగా చేస్తాయి.
తమలపాకు హెయిర్ ట్రీట్మెంట్ ఇలా చేయాలి:
- కొన్ని తమలపాకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి.
- ఈ పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసి జుట్టుకు అప్లై చేయాలి.
- గంట తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూ చేసి కడగాలి.
వారానికి ఒకసారి ఇలా చేస్తే, తెల్ల జుట్టు తగ్గి, నల్లగా మెరిసిపోతుంది.
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!
ఇంకో విధానం:
- 4–5 తమలపాకులు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 1 టీ స్పూన్ కాస్టర్ ఆయిల్ తీసుకోవాలి.
- తమలపాకులను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకుని, నూనెలు కలిపి మిశ్రమం తయారు చేయాలి.
- ఈ మిశ్రమాన్ని తలపై అప్లై చేసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
- 30 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి.
ప్రేమ వివాహం… పదేళ్ల దాంపత్యం తర్వాత భర్తనే బలి ఇచ్చిన భార్య.
తమలపాకు – నువ్వుల నూనె హెయిర్ మాస్క్:
తమలపాకులు, 2 స్పూన్ల నువ్వుల నూనె, 1 టీ స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు అప్లై చేసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో కడిగితే జుట్టు మెత్తగా, ఆరోగ్యంగా మారుతుంది.
తమలపాకు సహజమైన హెయిర్ టానిక్‌లా పనిచేస్తుంది — రెగ్యులర్‌గా వాడితే జుట్టు రాలే సమస్య తగ్గి, మెరిసే దట్టమైన జుట్టు పొందవచ్చు.
గ్లాస్ వాటర్ తాగినా మూత్రం వచ్చేస్తుందా?