Cancer : రాత్రిపూట లేటుగా అన్నం తినే వారికి క్యాన్సర్ వస్తుందా:
ఒకప్పుడు చాలా అరుదుగా వినిపించిన క్యాన్సర్(Cancer) వ్యాధి, నేడు ప్రతి ఇంటికీ దగ్గరగా మారుతోంది. బీపీ, షుగర్‌లా క్యాన్సర్లు కూడా జెనెటిక్‌గా వస్తున్నాయి. అయితే దీనికి కారణం కేవలం ఎరువులు, పురుగుమందులు, కాలుష్యమే కాదు. అసలు ప్రధాన కారణాలు మన రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలోనే దాగి ఉన్నాయి.
డాక్టర్ల మాటల్లో చెప్పాలంటే క్యాన్సర్(Cancer)కు ఊహించని కొన్ని కామన్ తప్పులు ప్రధాన కారణాలు. ముఖ్యంగా రాత్రి 9–11 గంటల మధ్య భోజనం చేయడం పెద్ద సమస్య. ఇలా ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో జరిగే ‘ఆటోఫాగీ’ అనే సహజ రిపేర్, క్లీనింగ్ ప్రక్రియ నిలిచిపోతుంది. దీని వల్ల కణాల్లో కాలుష్యం పెరిగి, మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది.
ROHIT SHARMA: క్రీడా రంగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ.
ఇక పోషకాలు లేని ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్స్, కృత్రిమ కలర్స్, ప్రిజర్వేటివ్స్ కలిగిన రెడీమేడ్ ఆహారం అధికంగా తీసుకోవడం మరో పెద్ద కారణం. ఇవి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాను తగ్గించి, ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి. అలాగే నూనెలో ఎక్కువగా వేయించిన వేపుళ్లు, డీప్ ఫ్రైడ్ స్నాక్స్, బాగా మాడిన ఆహారం ఫ్రీ రాడికల్స్‌ను పెంచి క్యాన్సర్‌కు దారి తీస్తాయి.
షుగర్ ఉన్నవారు అన్నం తినాలా? ఏ ధాన్యాలు సురక్షితం – గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా పూర్తి అవగాహన.
అతిగా ఉప్పు, చక్కెర వాడకం కూడా క్యాన్సర్(Cancer) ప్రేరకమేనని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అవసరానికి మించి ఉప్పు, షుగర్ తీసుకోవడం వల్ల శరీర రక్షణ వ్యవస్థ బలహీనమవుతుంది.
కాబట్టి క్యాన్సర్ (Cancer)నివారణకు సహజ ఆహారం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పెందలకాడే భోజనం, తగినంత నీరు, మంచి జీవనశైలి పాటిస్తే మంచి కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా రక్షించుకోవచ్చు.
Obesity: కొంతమంది ఎంత తిన్నా లావు అవ్వకపోవడానికి కారణం ఇదే.
చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్.. మహిళ ఏం చేసిందంటే?


