నిత్య దీపారాధనలో 100 లో 99 మంది చేసే తప్పులు ఇవే. 

నిత్య దీపారాధనలో 100 లో 99 మంది చేసే తప్పులు ఇవే. 

ఇంట్లో ఆడవారు వెలుపలో ఉన్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఒక ప్రశ్న దీపారాధన ఎలా చేయాలి అది కూడా అసౌచ్యం ఏదైనా ఇంట్లో ఉంటే ఎలా మంచిదే ఆడవారు వెలుపలో ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడ లేదు ఎందుకు లేదు అంటే పూజ అనేటటువంటిది ఎవరు చేయాలి అంటే ఇంటి యజమాని చేయాలి ధర్మ పత్నీ సమేతస్య అని ఉంది కానీ ధర్మపతి సమేతస్య అని ఉండదు సంకల్పం అంటే దాని అర్థం ఎవరు చేయాలని యజమాని చేయాలి.

యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడఉంది అభ్యంతరం ఏం లేదు ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళ బాగోగులు చూడాలి వాళ్ళకి వేళ్ళకి పలహారం పెట్టాలి ఏదో పాలు కాచి ఇవ్వాలి అటు అదిటి ఇది కూడా కష్టం అనుకుంటే నేను ఇందాక చెప్పాగా లఘువు చేసుకోండి ఈశ్వరా ఈ మూడు రోజులో నాలుగు రోజులో లఘువుగా చేస్తాను పూజ ఎందుకని అంటే కుటుంబ నిర్వహణ యందు సమయం కొంచెం ఎక్కువ కావలసి వచ్చింది

అందుకని తక్కువ పూజ చేస్తున్నాను దీన్ని పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి ఏమీ దోషం రాదు ఇక ఆమె వెలుపలో ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది పూజలో అంతర్భాగం దీపం పెట్టడం పూజే చేయొచ్చు అని నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది అభ్యంతరం లేదు నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నాను అంటే ఆవిడ వెలుపలో ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అలాగే దీపం పెట్టడం అన్న మాట మీద అనేకమంది ప్రశ్న వేశరు అందులో అన్ని కలిపి సంగ్రహంగా నేను ఒక మాట చెప్తున్నా దీపం ఎలా పెట్టాలి అని

దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు వేయాలి పూజ చేసినప్పుడు మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి ఇంకొక ముఖాన్ని చూడకూడదు తూర్పు ముఖంగా వెలగాలి మూడు దీప మూడు జ్యోతులు వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం అది ఈశ్వర స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్త్యాత్మకం ఇక వాళ్ళు ముగ్గురు తప్ప వేరొకటి లేదు లోకంలో కాబట్టి అటువంటి దీపపు సమ్య ఏది ఉందో

దాన్ని మీద పసుపు కానీ కుంకం కానీ అక్షతలు కానీ పువ్వు కానీ ఉంచాలి. ఎందుచేత అంటే మంగళ దీపం అంటాం మంగళ దీపం ఉంటుంది అమంగళ దీపం అని ఒకటి ఉంటుంది నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి పార్ధివ శరీరం ఒక్కటే ఉండకూడదు అందులో జ్యోతి వెళ్ళిపోయింది. అందుకే ఏం చేస్తారంటే పడుకో పెట్టి తలకట్టున ఓ దీపం పెడతారు దానికి మట్టి మీద పసుపు కుంకాలు వేయరు అది అమంగళ దీపం మంగళ దీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కాసిన పువ్వులు వేయాలి లేదా పసుపు వేయాలి లేకోతే కుంకుం వేయాలి లేకపోతే కాసిన అక్షతలు వేయాలి వేసి

నమస్కారం చేయాలి అదే ఈశ్వరుడు నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమావిద్యతోభాతి కుతోయమగ్ త్వమేవభాంతమనుభాతి సర్వంతస్య భాసాసర్వమిదం విభాతి లోకాలన్నీ కూడా ప్రళయంలో ఏకమైపోయినా ఒక్కడే ఉండి వెలుగులకు వెలుగుగా ఉండిపోయేటటువంటి వాడు ఎవరో వాడు పరమాత్మ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగు అతని వేసేవింతున్ వాడే దీపంగా ప్రకాశిస్తున్నాడు భా అంటే కాంతి అటువంటి దీపానికి మట్టు మీద ఒక పువ్వు వేసి నమస్కారం చేస్తారు ఇక ఇక పూజకి సంబంధించి మీకు ఆవిడ యొక్క సహకారము లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించవలసినటువంటి

కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది దో పసిపిల్లలు ఉన్నారు చాలా కష్టం అనుకుంటే లఘువుగా చేసి వెళ్ళిపోవచ్చు ఐదు ఉపచారాలు ఉమామహేశ్వరాభ్యాం నమః దీపం అర్గ్యం పాజ్యం చందనం నైవేద్యం సమాప్తం ప్రధా ఐదు చెప్పు లేదు 16 చెప్పి అక్షతలు వేసి లేచిపో నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేయి చాలు పూర్తఅయిపోతుంది.

పూర్తిగా మాత్రం మానకూడదు ఇంట్లో పూజ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఈ కారణానికే కాదు ఏటి సూతకంలో కూడా మానకూడదు చాలా మంది తెలియక ఏటి సూతకంలో పూజ మానేస్తా అంటుంటారు నిత్య పూజ మానకూడదు కానీ పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు చేయకూడదు కొండల మీదకి వెళ్ళకూడదు వెంకటాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళకూడదు తప్ప ఏటి సూతకంలో ఉన్నంత కాలం ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఏ అభ్యంతరము లేదు చేసి తీరాలి కూడా కాబట్టి ఆ పూజకి ఏ విధమైన దోషము రాదు ఆవునీతితో పెట్టడం పరమ శ్రేష్టం ఎందుచేత అంటే దానికి ఒక కారణం ఉంది ఆవునీతితో వెలుగుతున్న దీపం కానీ నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపం

మించి కానీ పొగ వచ్చినప్పుడు ఆ పొగ పూజ చేసుకుంటూ లోపలికి వెళ్ళింది అనుకోండి యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు శనీశ్చరుడు ప్రీతి చెందుతాడు శనీశ్వరుడు హృదయ కవాటానికి అధిపతి ఆయన గుండె కొట్టుకోవాలా కొట్టుకోకూడదా ఆయన నిర్ణయం చేస్తూఉంటాడు. ఇప్పుడు ఆ దీపపు పొగ వాసన చూస్తున్నాడు అనుకోండి హృదయ కమాటం మీద అనుగ్రహం ఉంటుంది ఈశ్వర కటాక్షం ఉండి గుండె కొట్టుకుంటుంది అంటే ఆరోగ్యంతో ఉంటాడు.

మీరు నమ్మండి నమ్మకపోండి ఈ మధ్య ఒక ఆవిడకి కాకినాడలో గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చింది ఎంత వేగంతో కొట్టుకోవాలో కండరాలు అంత వేగంగా కదలటం లేదు ఎక్కువ కదలకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఆవిడ కొంతకాలం నువ్వుల నూనె దీపం పెట్టి దాని మించి వస్తున్నటువంటి పొగని ఏ పూజ చేయకుండా భర్తగారు పూజ చేసి వెళ్ళిపోయాక పొగని వాసన చూస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చునేది కొన్నాళ్ళ అయిన తర్వాత ఆవిడ పరీక్షల కోసం పెడితే ఆశ్చర్యకరంగా ఆవిడకి గుండె కవాటాలు కండరాలు మామూలుగా పనిచేసాయి అందుకే కార్తీక మాసం వచ్చినప్పుడు దీపాలు ఎక్కువ పెట్టిస్తారు కారణం ఏంటంటే బయట చలి లోపల

రక్తనాళాలు కుంచించుకుపోతాయి మళ్ళీ వేడి పెంచడానికి దీపాలు పెట్టి ఆ పొగ ద్వారా ప్రాణుల్ని రక్షిస్తారు అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అన్ని దీపాలు వెలిగిస్తారు ఎక్కడ చూసినా దీపపు కాంతి పడితే చాలు మిగిలిన ప్రాణులన్నీ అభ్యున్నతి పొందుతాయి కాబట్టి అసలు ఒక శ్లోకం ఉంది కీటా పతంగాహమశకాస్చ విప్రాహ జలేస్థలేయేవసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః భవంతిత్వం శపచాహివిప్రాహ ఆ శ్లోకం చెప్పకుండా కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టకూడదు అది చెప్పి దీపం పెట్టాలి అసుర సంధ్య వేళలో కాబట్టి దీపం అనేటటువంటిది పెట్టడం మన అభ్యున్నతి

కొరకు ఇంట దీపం వెలుగుతోంది అంటారు అంటే ఇల్లు మంగళప్రదంగా ఉంది అని గుర్తు ఇల్లు శోభనాలకి శుభాలకి ఆలవాలంగా ఉంది అని గుర్తు ఆ ఇంట్లో ఊరికి దూరం అండి ఎవరు ఉండరు కనీసం దీపం పెట్టడం కోసం ఎవరికో ఇచ్చారు అంటారు. ఇంట దీపం లేకుండా ఎన్ని రోజులు ఉంటుందో ఇల్లు అంత అమంగళకరం నేను అందుకే పూర్వం ఒక ఆచారం ఉండేది ఎవరైనా తాళం వేసి ఊరెడుతున్నాడు అనుకోండి ఇంటి పురోహితుడికి తాళం చెవి ఇచ్చి వెళ్ళేవారు ఆయన వచ్చి దీపం పెట్టి బెల్లం గడ్డ నైవేద్యం పెట్టి వెళ్ళాలి ఇంట్లో పరమేశ్వరుడు ఉన్నాడు సింహాసనంలో ఆయన ఉన్నాడు తాళం వేసి వెళ్ళిపోతే ఆయనక అన్నం

ఆ భావన ఉంటే ఆయన ఉన్నాడని గుర్తు పర్వాలేదండి ఆయనకి లోటు ఏమిటండి ఆయనే నాకు పెడతాడండి అంటే ఇంకేం పరమేశ్వరుడు అందుకే బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం పెట్టి వెళ్ళేవారు ఒకవేళ అలా ఏ కారణం చేతనైనా ఇంటి పురోహితుడు వచ్చి కూడా దీపం పెట్టకుండా ఇల్లు సంవత్సరంలో కొన్ని రోజులు తాళం వేసి ఉన్న కారణం చేత అమంగళకరమైనటువంటి స్థితి యజమానికి కలగకుండా దోషాలు నివారణ కావాలంటే దానికి శాస్త్రంలో మినహాయింపు కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం 365 ఒత్తులు గుత్తి చేసి నేతిలో ముంచి దీపం వెలిగిస్తారు 365 రోజులు మా ఇంట్లో దీపం పెట్టని దోషం ఏదన్నా ఉంటే తొలగుగాక

దీపానికి అంత ప్రాధాన్యత ఉంది ఇంట దీపం వెలగాలి కాబట్టి ఆవిడ సహకారాన్ని బట్టి ఆవిడ లేకపోతే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు అనుకున్నారు ఉంటే సంగ్రహంగా చేయొచ్చు దీపం పెట్టడానికి అభ్యంతరం అసలు ఎప్పుడూ లేదు నేను మీ ప్రశ్నకి సమగ్రంగా జవాబు ఇచ్చాను అనుకుంటున్నాను సంతోషం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *