జామ చెట్టు, జామ కాయలు తెలియని వారు ఎవరు ఉండరు. దాదాపు గ్రామంలో ప్రతి కనిపించే చెట్టు ఈ జామ చెట్టు, ఈ చెట్టు కాయలు ఎంత మధురంగా ఉంటాయో అందరికీ తెలుసు. అందరికీ ఇష్టమైన అతి తక్కువ ఖర్చు లో దొరికే పండు జామ పండు అని చెప్పవచ్చు.. జామకాయలు డయాబెటిస్ మరియు అనేక వ్యాధులు ఉన్న వారికి ఉపయోగపడే ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. జామకాయలే కాదు, జామ ఆకులు కూడా అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. . జామచెట్టు ఆకుల తో చేసిన టీ క్యాన్సర్‌తో పోరాడుతుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మధుమేహానికి చికిత్స లాగా పనిచేస్తుంది. జామ ఆకు టీ బలమైన యాంటీ బాక్టీరియల్ చర్యలను కలిగి ఉంది అని అనేక అధ్యయనాలలో ధృవీకరించబడింది. ఎవరైతే జలుబు మరియు ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల తో బాధ పడుతున్నారో వారికి చికిత్స చేయడానికి సాంప్రదాయ ఔషధం లో ఈ చెట్టు ఎండిన ఆకులను ఉపయోగిస్తారు. జామ చెట్టు యొక్క ఆకులు శోథ నిరోధక లక్షణాలు పంటి నొప్పిని పరిష్కరించడంలో మరియు వాపును తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.
జామ ఆకులను నమలడం ద్వారా చూర్ణంలా మారి చిగురుల వాపు తగ్గించడంలో ఉపయోగపడుతాయి. జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి. జామ ఆకులు స్త్రీ లలో రుతుస్రావం వలన వచ్చే బాధాకరమైన లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. జామకాయలు తినడం మీ చర్మానికి మంచి మేలు కలుగుతుంది. జామ ఆకుల కషాయాన్ని రోజు నోట్లో వేసుకొని పుక్కిలించడం ద్వారా పళ్ళలో దంతక్షయానికి కారణమయ్యే పురుగులను పోగొట్టి పంటి సమస్యలు తగ్గిస్తుంది. జుట్టు సమస్య ను తగ్గించడంలో కూడా జామ ఆకులు చాలా బాగా ఉపయోగపడుతాయి.
ముందుగా కొన్ని జామ ఆకులను తీసుకుని వాటిని లీటరు నీటిలో వేసి సుమారు 20 నిమిషాల పాటు మరగబెట్టండి. ఆ నీరు రంగు మారాక ద్రవాన్ని వడకట్టండి. ఆ తరువాత చల్లబరచండి. ఈ ద్రావణాన్ని మీ తలకు అప్లై చేసి, ఆపై మీ జుట్టు కుదుళ్ళకు వరకు మసాజ్ చేయండి. మీ జుట్టు శుభ్రంగా మరియు షాంపూని ఉపయోగించిన తర్వాత కండీషనర్ బదులు వాడండి. ఇవి చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తొలగిస్తుంది. మరియు జుట్టును శుభ్రంగా మృదువుగా చేస్తుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb