Kidneys Health:కిడ్నీలు ఒక రోజుకు ఎంత సోడియం ని ఎలిమినేట్ చేస్తాయి తెలుసా మీకు:
ఈరోజు హెల్త్ టిప్‌లో ఫాస్టింగ్ చేయడం లేదా ఉప్పు తగ్గించమన్నప్పుడు చాలామందికి వచ్చే సందేహాలపై డాక్టర్ గారు అవగాహన కల్పిస్తున్నారు. “సోడియం లెవెల్స్ తగ్గితే ఏమవుతుంది? ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీలకు(Kidneys Health) నష్టం జరుగుతుందా?” అనే ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. నిజానికి మన కిడ్నీలు చాలా శక్తివంతమైన అవయవాలు. రోజుకు పెద్ద మొత్తంలో సోడియాన్ని ఫిల్టర్ చేసే సామర్థ్యం వాటికి ఉంటుంది.
సాధారణంగా రోజుకు 5 గ్రాములకంటే ఎక్కువ టేబుల్ సాల్ట్ తీసుకోకూడదని వైద్యులు సూచిస్తారు. కానీ మనలో చాలామంది 15 నుంచి 20 గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్నారు. హై బీపీ ఉన్నవారు కూడా 5 నుంచి 10 గ్రాముల మధ్య తీసుకుంటున్నారు. టేబుల్ సాల్ట్‌లో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటుంది. అంటే రోజుకు మనం 5 నుంచి 10 గ్రాముల వరకు సోడియాన్ని శరీరంలోకి పంపిస్తున్నాం.
High Fat High Protein Food | రక్తంలో చక్కెరను త్వరగా పెంచదు.
కిడ్నీలు సరిపడా నీళ్లు తాగి, మూత్ర విసర్జన బాగా జరిగితే రోజుకు సుమారు 2 నుంచి 4–5 గ్రాముల వరకు సోడియాన్ని బయటకు పంపగలవు. మిగిలిన సోడియం శరీరంలోనే నిల్వవుతుంది. అయితే ఎక్కువ నీళ్లు తాగి, చెమట పట్టేలా శ్రమ చేస్తే ఆ సోడియం బయటకు వెళ్తుంది. అందుకే మన పూర్వీకులు ఉప్పు ఎక్కువగా తిన్నప్పటికీ కష్టపడి పనిచేయడం, నీళ్లు బాగా తాగడం వల్ల పెద్దగా సమస్యలు రాలేదు.(Kidneys Health)
కానీ వయస్సు పెరిగే కొద్దీ పని తగ్గింది, నీళ్లు తాగడం తగ్గింది, ఉప్పు మాత్రం అదే స్థాయిలో కొనసాగింది. ఫలితంగా కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు, బీపీ, పక్షవాతం, కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. ఈరోజుల్లో చిన్న వయసు నుంచే నీళ్లు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, కానీ ఉప్పు మాత్రం ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ డ్యామేజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. రక్తంలో క్రియాటినిన్ పెరగడం అంటే కిడ్నీలు వ్యర్థాలను బయటకు పంపలేకపోతున్నాయన్న మాట.
అమెరికాలో భారతీయుడి గొప్ప మనసు: నిరుపేద జంట ఆకలి తీర్చి నెటిజన్ల మనసు గెలుచుకున్న నోవా.
అందుకే ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. ముందే జాగ్రత్త పడితే జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. వచ్చాక బాధపడే కన్నా ఇప్పుడే మారుదాం. పూర్తిగా మానేయలేకపోతే అయినా తగ్గించుకోండి. మీ ఆరోగ్యం(Kidneys Health) పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది.