Obesity: కొంతమంది ఎంత తిన్నా లావు అవ్వకపోవడానికి కారణం ఇదే.
ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన విషయం ఊబకాయం, అధిక బరువు సమస్యలు మరియు గట్ బ్యాక్టీరియా మధ్య ఉన్న సంబంధం గురించి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం(Obesity). చాలామంది “కొవ్వు ఎక్కువ తింటేనే లావవుతాం” అని అనుకుంటారు. కానీ అసలు కథ అంతా మన ప్రేగుల్లో ఉన్న సూక్ష్మజీవులు, అంటే గట్ బ్యాక్టీరియా చుట్టూనే తిరుగుతుందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
మన శరీర ఆరోగ్యం మొత్తం ప్రేగుల్లో ఉన్న బ్యాక్టీరియాలపై ఆధారపడి ఉంటుంది. బరువు పెరగడమా, తగ్గడమా, షుగర్ రావడమా, మానసిక ఒత్తిడా—ఇవన్నీ కూడా గట్ బ్యాక్టీరియా ప్రభావంతోనే జరుగుతాయి. ఈ విషయం మీద ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.
చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్.. మహిళ ఏం చేసిందంటే?
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి గారు చెప్పిన ఒక ఆసక్తికరమైన ప్రయోగం దీనికి నిదర్శనం. సన్నగా ఉన్న ఎలుకల నుంచి తీసుకున్న గట్ బ్యాక్టీరియాను లావుగా ఉన్న ఎలుకలకు మార్పిడి చేయగా, లావు ఎలుకలు సన్నబడాయి. అదే విధంగా లావు ఎలుకల బ్యాక్టీరియాను సన్న ఎలుకలకు ఇచ్చినప్పుడు అవి లావు కావడం మొదలుపెట్టాయి. దీని ద్వారా బరువు పెంచే బ్యాక్టీరియా, సన్నగా ఉంచే బ్యాక్టీరియా వేర్వేరుగా ఉంటాయని స్పష్టమైంది.
ఈ కారణంగానే ఇప్పుడు కొన్ని దేశాల్లో “స్టూల్ బ్యాంక్స్” కూడా ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో గట్ బ్యాక్టీరియా మార్పిడి ద్వారా ఊబకాయం చికిత్స చేసే రోజులు కూడా రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
షుగర్ ఉన్నవారు అన్నం తినాలా? ఏ ధాన్యాలు సురక్షితం – గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా పూర్తి అవగాహన.
పరిశోధనల ప్రకారం కొన్ని బ్యాక్టీరియా బరువు పెరగడానికి కారణమవుతాయి. ఉదాహరణకు ఫర్మిక్యూట్స్ అనే బ్యాక్టీరియా ఆహారాన్ని(Obesity) పూర్తిగా జీర్ణం చేసి ఎక్కువగా శరీరంలోకి పంపిస్తుంది. ఎల్-రేటరే, క్లాస్ట్రిడియం, ఎంటిరోబాక్టర్, మిథానోబ్రేవిబాక్టర్ వంటి బ్యాక్టీరియా కొవ్వు నిల్వలను పెంచడం, ఆకలిని ఎక్కువ చేయడం, ఇన్సులిన్ పనితీరును దెబ్బతీయడం వంటి చర్యల ద్వారా ఊబకాయాన్ని పెంచుతాయి.
అదే సమయంలో సన్నగా ఉంచే మంచి బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. బాక్టీరియోడిటిస్, అకర్మాన్సియా, బిఫిడోబాక్టీరియా లాంటి బ్యాక్టీరియా కొవ్వు శోషణను తగ్గించి, చెడు బ్యాక్టీరియా పెరగకుండా (Obesity)నియంత్రిస్తాయి. అందుకే కొందరు ఎంత తిన్నా లావుకాకుండా ఉంటారు.
Viral Video:కోర్టు హాల్లో భార్య దాడి.. నవ్వుతూ తప్పించుకున్న భర్త.. వైరల్ వీడియో వెనుక షాకింగ్ కథ!
గట్ బ్యాక్టీరియా కొంతవరకు జన్యుపరంగా వచ్చినా, వాటిని మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మంచి బ్యాక్టీరియా పెరగాలా, చెడ్డ బ్యాక్టీరియా పెరగాలా అన్నది నిర్ణయమవుతుంది.
హై ఫైబర్ ఆహారం, సహజమైన ఆహారం, పాలిష్ చేయని ధాన్యాలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫైబర్ గుడ్ బ్యాక్టీరియాలకు ఆహారంలా పనిచేస్తుంది. అదే సమయంలో ప్యాక్డ్ ఫుడ్స్, చక్కెర పానీయాలు, కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం తీసుకుంటే మంచి బ్యాక్టీరియా తగ్గి చెడ్డవి పెరుగుతాయి.
మల మార్పిడి వంటి చికిత్సలకు ఇంకా సమయం ఉన్నా, ఆహార మార్పు (Obesity)మాత్రం ఇప్పుడే మొదలుపెడితే ఫలితం వెంటనే కనిపిస్తుంది. కాబట్టి సన్నగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా – ముందుగా మన గట్ బ్యాక్టీరియాను సంరక్షించుకోవడం చాలా అవసరం.
Ovarian Cysts:జుట్టు పల్చబడటం, మెడ చుట్టూ నలుపు ఈ లక్షణాలు మీకు ఉన్నాయా?



