ఏపీ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100కు 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన జనసేన పార్టీ, ఎన్నికల్లో ఇరవై ఒక్క ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఎమ్మెల్యే లతో పాటు రెండు ఎంపీలను సొంతం చేసుకుంది. పోటీ చేసిన ప్రతి చోటా గెలిచి 100%శాతం గెలిచారు జనసేన అభ్యర్థులు.
దీంతో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచిన పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా అతడిని ఒకే ప్రశ్నను అడుగుతున్నారట. పోటీ చేసిన ప్రతి చోట సీటు ఎలా గెలిచారని అందరూ అడుగుతూ అవుతున్నారట. అయితే ఈ విషయం పై ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….. ప్రతి ఒక్కరు నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మీరు పోటీ చేసిన అన్ని సీట్లు ఎలా గెలిచారు అని ప్రశ్నిస్తున్నారట.
అయితే దీంతో పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడట. జనసేన పార్టీ ఘన విజయం సాధించడానికి జనసేన అధినేతలు ఎంతో కష్టపడ్డారు. ఇక ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నేను పడిన కష్టాలు, దెబ్బలు, అవమానాలు మరెవరైనా పడి ఉంటే పార్టీ ని కనీసం ఒక వారం రోజులు కూడా నడిపేవారా అని చెప్పుకొచ్చారు.. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోగానే అసెంబ్లీలో కూడా ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓటమి అనేది ప్రతి మనిషిని అంతగా భయపెడుతుంది.ఈ సందర్భంలో మాట్లాడుతూ కొన్ని రోజుల తర్వాత మంత్రి పదవి నుంచి తప్పకుంటానని చెప్పుకొచ్చాడు.