Rashmika | స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో రష్మిక మందన్న:
సినిమా అంటేనే సరైన జోడీ ని పెట్టి తీస్తుంటారు. ఒకవేళ హీరో, హీరోయిన్ లో ఎవరు సరిగా అనిపించక పోయిన సరైన జోడీ దొరికే వరకు వెతుకుతారు. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్(Rashmika)ను పెట్టారు. ప్రస్తుతం ఆ స్టార్ హీరోయిన్.. ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో ఉంటున్నట్టు బాలీవుడ్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికందర్ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను లోనావాలాలోని సల్మాన్ ఫామ్‌హౌజ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ మూవీ యూనిట్‌కు సంబంధించిన వారాంతా ఆ లోకేషన్‌లోనే ఉంటున్నారు. బాలీవుడ్‌పై లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరికల నేపథ్యంలో స్టార్ హీరో, హీరోయిన్లందరూ కొంత మేరకు అప్రమత్తమయ్యారు. సల్మాన్ ఖాన్‌ను హతమారుస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఆయన కు భారీ భద్రతను పెంచారు.
ప్రస్తుతం అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య షూటింగ్ జరుగుతుున్నది. అయితే బాలీవుడ్ మూవీ సికందర్ షూటింగ్ కోసం రష్మిక మందన్న ప్రస్తుతం పన్వేల్‌లోని సల్లూభాయ్ ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నారు. పన్వెల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. భద్రత దృష్టా రష్మిక(Rashmika) అక్కడే ఉండాలని సూచించడంతో నేషనల్ క్రష్ అక్కడే మకాం పెట్టింది.
ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన లోపలి వాతావరణాన్ని అన్యనా పాండే సోదరుడు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నది. అయితే ఆ క్యాంపస్‌లో ఉన్న స్పోర్ట్స్ విభాగం, జంతువులు, చెట్లు, బైక్స్ కలెక్షన్ ఫోటోలు చూస్తే పెద్ద ప్రపంచమే ఆ ఫామ్‌హౌస్‌లో ఉన్నట్టు అర్ధమవుతుంది. ఇక నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) కేవలం మూవీనే కాకుండా అక్కడి గుట్టలు, పుట్టలు, అడవితో కూడిన పరిస్థితనుల ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb