ప్రస్తుతం లోవరాజు తుని ఆర్టీసీ డిపో లో ఫేమస్ అయిన వ్యక్తి. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామానికి చెందిన లోవరాజు ఆర్టీసీలో కాంట్రాక్ట్ బేసిస్ గా డ్రైవర్ గా పని చేస్తున్నారు. అయితే ఇటీవలే ఎన్ ఎన్ పట్నం నుంచి ఆర్టీసీ బస్సు తుని పట్టణానికి వస్తున్న తరుణంలో అదే రహదారిలో ట్రాక్టర్ రోడ్డుకు అడ్డుగా ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇరుకు రోడ్లు కావడంతో ఎదట వాహనం క్లియర్ అయితే గాని ఈ వాహనం వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుంది.
ఈ నేపథ్యంలో అక్కడ అరగంటకు పైగా బస్సు ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక బస్సులో కాలేజీ స్టూడెంట్స్ ఉన్న నేపథ్యంలో పాటలు పెట్టి డ్రైవర్ లోవరాజును స్వతహాగా డాన్సర్ కావడంతో విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు. ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు బస్సు ఎదురుగా సరదాగా దేవర సినిమాలో పాటకు డ్యాన్స్ చేశారు. కొంతమంది మొబైల్ రికార్డు చేయడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
డ్రైవర్ వీడియో వైరల్ కావడంతో ఆర్టీసీ అధికారులు విచారణ చేశారు. బస్సు ఆగిపోవడానికి కారణాలు, లోవరాజు డ్యాన్స్ వ్యవహారంపై ఆరా తీశారు. అప్పటి వరకు ఆయన్ను విధుల నుంచి తప్పించారు.. ఈ నిర్ణయంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ కారణంగా బస్సు ఆగిపోయిందని.. ఆ సమయంలో సరదాగా డ్యాన్స్ చేశానని లోవరాజు అంటున్నారు. కాకినాడ ఆర్టీసీ డ్రైవర్ పై సస్పెన్షన్ ఎత్తివేశారు ఈ మేరకు మంత్రి నారా లోకే ష్ ప్రకటన చేశారు. ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని ట్వీట్ చేశారు మంత్రి లోకేష్.
బస్సు రిపేర్ రావడంతో దేవర సాంగ్ కి స్టెప్ లు వేసిన కాంట్రాక్టు డ్రైవర్ లోవరాజును ఉద్యోగం నుంచి తొలగించారు.కానీ డ్రైవర్ డాన్స్ ను అభినందించిన మంత్రి నారా లోకేష్.. పోస్ట్ కూడా పెట్టారు. ఈ తరునంలోనే… లోవరాజు ను తొలగించడం పై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వచ్చారు నెటిజన్లు. ఈ తరునంలోనే… లోవరాజు ఉద్యోగం చేసుకోవచ్చని, త్వరలోనే కలుస్తానని ప్రకటించారు లోకేష్. దీంతో.. కాకినాడ ఆర్టీసీ డ్రైవర్ పై సస్పెన్షన్ ఎత్తివేశారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb