ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది జిమ్ వ్యాయామాలు, ఆటలు, రన్నింగ్, జాగింగ్ వంటి అనేక రకాల వ్యాయామాలు చేస్తున్నారు. ఇవన్నీ శరీరానికి ఉపయోగకరమే అయినప్పటికీ, యోగా, ప్రాణాయామం మరియు సూర్య నమస్కారాలు శారీరక-మానసిక ఆరోగ్యానికి మరింత సమగ్ర లాభాలను అందిస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇతర వ్యాయామాలతో పోలిస్తే యోగా, ప్రాణాయామం శరీరంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపి శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి.
సాధారణంగా జిమ్ వ్యాయామాలు, ఆటలు లేదా కఠినమైన వర్కవుట్స్ చేసినప్పుడు మన శరీరంలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. దీంతో అడ్రినలిన్, కార్టిజాల్ వంటి హార్మోన్లు పెరిగి గుండె వేగం, శ్వాస వేగం, రక్తపోటు కొంత పెరుగుతాయి. ఇది శరీరానికి తాత్కాలికంగా శక్తిని ఇచ్చినా, మానసికంగా కొంత ఉత్కంఠను కూడా కలిగిస్తుంది.
శృం***గార సామర్థ్యాన్నిపెంచే పౌడర్ ఇది.
కానీ యోగా మరియు ప్రాణాయామం చేసే సమయంలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. దీనివల్ల శరీరం ప్రశాంత స్థితిలోకి వెళ్తుంది. గుండె వేగం తగ్గుతుంది, శ్వాస నెమ్మదిగా మరియు లోతుగా జరుగుతుంది, రక్తపోటు సైతం నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా యోగా సమయంలో శ్వాసపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది.
మానసికంగా కూడా యోగా ఎంతో మేలు చేస్తుంది. తీవ్రమైన వ్యాయామాలు చేసినప్పుడు మనసు ఉత్సాహంగా ఉన్నా ఆలోచనలు వేగంగా ఉంటాయి. కానీ యోగా ప్రాణాయామం చేస్తే మనసు నిశ్చలంగా, ప్రశాంతంగా మారుతుంది. అలలు లేని నది లాగా మైండ్ స్థిరంగా ఉండి ఆలోచనలపై నియంత్రణ పెరుగుతుంది.
విడాకులకు దరఖాస్తు చేసిన టీవీకే చీఫ్ విజయ్ భార్య.
అదే సమయంలో యోగా చేయడం వల్ల సెరటోనిన్, డోపమిన్ వంటి హ్యాపీ హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను కలిగించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అందువల్ల యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే యోగ విద్యను అభివృద్ధి చేసి మనకు అందించారు. యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు అనుభవంతో చెప్పారు. అందుకే యోగా పై ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, కోర్సులు కూడా ఏర్పడ్డాయి.
డయాబెటిస్ వారు ఎటువంటి ఫ్రూట్స్ తినవచ్చు.
ఆటలు, జిమ్, డాన్స్ లేదా ఇతర వ్యాయామాలు ఏవి చేసినా అవి మంచివే. కానీ వాటితో పాటు వారానికి కనీసం మూడు లేదా నాలుగు రోజులు యోగా మరియు ప్రాణాయామాన్ని కూడా అభ్యాసం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి యోగాను దినచర్యలో భాగం చేసుకుంటే శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. నమస్కారం.
‘బూకీ’ ఈవెంట్‌లో ఆసక్తికర చర్చ: తొందరపడి పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దన్న మంచు లక్ష్మీ