మనలో చాలామంది రాత్రి 10 గంటలకల్లా భోజనం చేసి పడుకుంటే మంచి నిద్ర వస్తుందని భావిస్తుంటాం. ఉదయం ఐదు–ఆరు గంటలకల్లా నిద్ర లేస్తాం. అయితే, “గాఢ నిద్ర ఎప్పుడు వస్తుంది?” అని అడిగితే అందరూ ఒకే సమాధానం చెబుతారు – తెల్లవారుజామున నాలుగు–ఐదు గంటల సమయంలోనే నిజమైన గాఢ నిద్ర పడుతుందని. అంటే మన శరీరం ఎప్పుడు గాఢ నిద్రలోకి వెళ్లుతుందో మనకే స్పష్టంగా తెలుస్తుంది.
కాని ప్రశ్న ఏమిటంటే, రాత్రి 10 గంటలకే పడుకున్నా, ఎందుకు తెల్లవారు జామునే గాఢ నిద్ర వస్తుంది?
High Calcium Foods|వీటిని 7 రోజులు తింటే నరాల బలహీనత తగ్గి ఎముకలు బలంగా అవుతాయి.
భోజనం చేసిన వెంటనే ఏమి జరుగుతుంది?
పొట్ట నిండా భోజనం చేసి పడుకున్న వెంటనే
- ఊపిరితిత్తుల (శ్వాస) వేగం నిమిషానికి సుమారు 25–30 వరకూ ఉంటుంది
- గుండె వేగం 70–80 వరకూ ఉంటుంది
ఎందుకంటే లోపల మన జీర్ణవ్యవస్థ (డైజెషన్) బిజీగా పనిచేస్తోంది. ఆహారం అరిగించే క్రమంలో శరీరం ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ రక్త ప్రవాహం అవసరపడుతుంది. అందుకే
- గుండె వేగం ఎక్కువగా,
- ఊపిరితిత్తుల పని వేగంగా కొనసాగుతుంది.
ఈ సమయంలో శరీరం పూర్తిగా రిలాక్స్ అవ్వదు. అందుకే ఆ సమయంలో వచ్చే నిద్ర “మత్తు నిద్ర” మాత్రమే, కానీ గాఢ నిద్ర కాదు.
చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్‌చెరులో విషాద ఘటన.
గాఢ నిద్ర ఎప్పుడు మొదలవుతుంది?
తెల్లవారుజామున నాలుగు–ఐదు గంటలకు
- పొట్ట ఖాళీ అవుతుంది
- ఆహారం మొత్తం అరిగిపోతుంది
- జీర్ణవ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది
ఫలితంగా:
- ఊపిరితిత్తుల వేగం 12–15కు పడిపోతుంది
- గుండె వేగం 55–62 మధ్యకి వస్తుంది
ఈ రెండు వేగాలు తగ్గినప్పుడు శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. ఆ సమయంలోనే మనకి నిజమైన గాఢ నిద్ర మొదలవుతుంది.
హార్ట్ బ్లాక్స్ తగ్గించడానికి నేచురల్ హోమ్ రెమిడీస్.
గాఢ నిద్ర ఎక్కువ గంటలు రావాలంటే ఏమి చేయాలి?
మీరు రాత్రి 10 గంటలకల్లా పడుకునే వారు అయితే,
గాఢ నిద్రను ఆరు–ఏడు గంటల పాటు పొందాలంటే ముఖ్యమైన రహస్యం:
సాయంత్రం 6 గంటలకల్లా డిన్నర్ ముగించండి.
అది కూడా
- నానబెట్టిన విత్తనాలు
- పండ్లు
- తేలికైన నాచురల్ ఫుడ్స్
వంటివి తీసుకుంటే, రాత్రి 9–9:30 కల్లా పొట్ట పూర్తిగా ఖాళీ అయిపోతుంది.
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!
అలా అయితే మీరు పడుకున్న క్షణం నుంచే
- గుండె వేగం తక్కువగా
- ఊపిరితిత్తుల వేగం సాంత్వనకరంగా
- శరీరం పూర్తి రిలాక్స్‌లోకి వెళ్లి
గాఢ నిద్ర 6–7 గంటల పాటు దొరుకుతుంది.
ఎర్లీ డిన్నర్ + నాచురల్ ఫుడ్ =
తీరని ఆరోగ్యం + పొడవైన గాఢ నిద్ర, ఇది మారని నిజమైన ఆరోగ్య రహస్యం.
ఈ చిన్న జ్యూస్ తో మీ లివర్ ని కడిగినట్లు చేసుకోండి.