Ovarian Cysts:జుట్టు పల్చబడటం, మెడ చుట్టూ నలుపు ఈ లక్షణాలు మీకు ఉన్నాయా:
వయసులో ఉన్న ఆడపిల్లలు, యువతుల్లో ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటి ఓవరీస్‌లో నీటి బుడగలు (PCOD/PCOS). సాధారణంగా ఉండవలసిన బరువుకంటే 7 నుంచి 10 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కొంతమంది సన్నగా ఉన్నప్పటికీ హార్మోన్ల లోపాల వల్ల ఈ సమస్య రావడం గమనించబడుతోంది. చాలామంది తమకు ఈ సమస్య లేదని అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ తీవ్రమైన లక్షణాలు వచ్చినప్పుడు టెస్టులు చేయించుకుంటే ఓవరీస్‌లో నీటి బుడగలు(Ovarian Cysts) ఉన్నాయని డాక్టర్లు నిర్ధారిస్తుంటారు.
ఓవరీస్‌లో వచ్చే ఈ నీటి బుడగలు(Ovarian Cysts) కేవలం ఓవరీస్‌కే పరిమితం కాకుండా శరీరమంతటా ప్రభావం చూపుతాయి. పెళ్లి, పిల్లలు వంటి విషయాలకే సమస్య వస్తుందని అనుకోవడం తప్పు. దీని దుష్ప్రభావం అనేక అవయవాలపై పడుతుంది. ముఖ్యంగా ఈ సమస్య ఉన్న స్త్రీలలో మూడు రకాల ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి.
CM Chandrababu: 6 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్ కు వెళ్ళాను.
మొదటిది – నెలసరి అస్తవ్యస్తం (Anovulation / Irregular periods):
అండం సరిగా విడుదల కాకపోవడం వల్ల నెలసరి సమయానికి రాకపోవడం, కొన్ని నెలలు అస్సలు రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇంతకు ముందు నెలనెలా సక్రమంగా వచ్చిన పీరియడ్స్ అకస్మాత్తుగా అస్తవ్యస్తంగా మారితే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి ఓవరీస్ స్కాన్ చేయించుకోవడం అవసరం. ఈ లక్షణాలు టీనేజ్ అమ్మాయిల్లో కనిపిస్తే తల్లిదండ్రులు తప్పకుండా టెస్టులకు తీసుకెళ్లాలి. (Ovarian Cysts)
రెండవది – మగ హార్మోన్లు పెరగడం (Hyperandrogenism):
ఆడపిల్లల్లో టెస్టోస్టిరోన్ వంటి మగ హార్మోన్లు అవసరానికి మించి పెరిగితే ముఖంపై, మీసాలపై, గడ్డం వద్ద అనవసర జుట్టు పెరగడం, తలపై జుట్టు పలుచబడటం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మానసిక ఒత్తిడిని కూడా పెంచుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి పాంక్రియాస్ పనితీరుపై ప్రభావం పడుతుంది. దీని వల్ల ఆకలి ఎక్కువ కావడం, బరువు మరింత పెరగడం జరుగుతుంది. మెడ చుట్టూ నలుపు రంగు మచ్చలు రావడం కూడా ఈ లక్షణాల్లో ఒకటి.

Remove Fat: పుచ్చకాయ ఇలా తింటే కేజీ బరువు పెరుగుతారు.
మూడవది – అధిక లేదా అసమాన రక్తస్రావం (Oligomenorrhea / Menorrhagia):
నెలసరి సమయంలో ఎక్కువగా రక్తస్రావం కావడం, ముద్దలుగా రావడం లేదా కొన్ని సార్లు పూర్తిగా బ్లీడింగ్ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీనికి ప్రధాన కారణం ఈస్ట్రోజెన్ హార్మోన్ల అసమతుల్యత. ముఖ్యంగా శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారిలో ‘ఈస్ట్రోన్’ హార్మోన్ అధికంగా విడుదలై గర్భాశయంలోని ఎండోమెట్రియం మందం పెరుగుతుంది. దీంతో రక్తసరఫరా సరిగా లేక నెలసరి సమస్యలు మరింత తీవ్రంగా మారుతాయి.
ఈ మూడు లక్షణాల్లో ఏదైనా కనిపిస్తే ఓవరీస్‌లో నీటి బుడగలు(Ovarian Cysts) ఉన్నాయా లేదా అని తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి. సమయానికి గుర్తించి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చు. సరైన ఆహారం, వ్యాయామం, నేచురోపతి లైఫ్‌స్టైల్ పాటించడం ద్వారా మూడు నెలల్లోనే మంచి ఫలితాలు పొందవచ్చు.
చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్.. మహిళ ఏం చేసిందంటే?
నిర్లక్ష్యం చేస్తే చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఓవరీస్‌లో నీటి బుడగలు(Ovarian Cysts) ఉన్నవారిలో ఇన్సులిన్ సరిగా పనిచేయక రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే తల్లిదండ్రులు, యువత ఈ విషయంలో అవగాహన పెంచుకొని పిల్లల జీవనశైలిని చిన్నప్పటి నుంచే సరిదిద్దుకోవాలి.
Hair Fall Solutions: బక్కగా ఉన్న వారి కోసం స్పెషల్ ప్రోటీన్.
డ్రగ్‌లెస్, సైడ్ ఎఫెక్ట్ లేని నేచురోపతి జీవనశైలి ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం. అవగాహనతో ముందడుగు వేస్తే ఓవరీస్ సమస్యలు మాత్రమే కాదు, భవిష్యత్ ఆరోగ్య సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.
MPDO Office Rent Issue:ప్రభుత్వ కార్యాలయానికే దిక్కులేదు.. అద్దె బకాయిలతో రోడ్డున పడ్డ అధికారులు.