Flax Seeds Benefits:మీ గుండె ఆయుష్షును పెంచే గింజలు ఇవి.

Flax Seeds Benefits:మీ గుండె ఆయుష్షును పెంచే గింజలు ఇవి.

Flax Seeds Benefits: అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తాయని శాస్త్రీయంగా రుజువైంది. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా, హార్ట్ అటాక్స్ మరియు బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి రక్షించడంలో ఇవి ఆరు విధాలుగా మేలు చేస్తాయి.

ఒకప్పుడు గుండెజబ్బులు, పక్షవాతం వృద్ధులకే పరిమితమయ్యేవి. కానీ నేడు తప్పు ఆహార అలవాట్లు, ప్రమాదకరమైన వంటల విధానం వల్ల చిన్న వయసులోనే ఈ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రక్తనాళాల లోపలి పొర దెబ్బతినడం, చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడం, మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గడం ఇందుకు కారణాలు.

Annatto Seeds: కంటి ఆరోగ్యానికి ది బెస్ట్ ఇది.

అవిసె గింజల్లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, లివర్‌లో చెడు కొలెస్ట్రాల్ తయారును తగ్గిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అవిసె గింజల్లోని లిగ్నాన్ అనే పదార్థం రక్తనాళాల గోడలకు కొలెస్ట్రాల్ అంటుకోకుండా అడ్డుకుంటుంది.

ఇవి రక్తం గడ్డకట్టకుండా చేసి, రక్తనాళాలను విస్తరింపజేసి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి రక్తప్రవాహాన్ని సాఫీగా చేస్తాయి. అంతేకాదు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి రక్తనాళాల లోపలి పొరను మృదువుగా ఉంచుతాయి.

సూర్య గ్రహణం ప్రభావంతో 4 రాశులవారికి జరిగేది ఇదే..?

రోజుకు 2–3 స్పూన్ల అవిసె గింజల పొడి తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఒమేగా–3 అందుతుంది. గింజలను పొడి చేసి, భోజనంలో లేదా సలాడ్స్‌పై చల్లుకొని వాడుకోవచ్చు. అవిసె ఉండలు, చిక్కీ రూపంలో కూడా తీసుకోవచ్చు. చిన్న వయసులో వచ్చే గుండెజబ్బులు, పక్షవాతాల నుంచి కుటుంబాన్ని కాపాడుకోవాలంటే అవిసె గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.

Ovarian Cysts:జుట్టు పల్చబడటం, మెడ చుట్టూ నలుపు ఈ లక్షణాలు మీకు ఉన్నాయా?

ఎవ్వరూ బంగారం కొనొద్దు..! అందరం కలిసి ఉద్యమం చేద్దాం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *