Hero Raviteja:బైక్ నాది కాదు అంటూ పోలీస్ ల ముందు నన్ను బుక్ చేశాడు హీరో రవితేజ.
Hero Raviteja:రఘు కుంచె తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనూ, బుల్లితెర లోనూ ఈ వ్యక్తి తెలియని వారు ఉండరు. అయితే రఘుకుంచె బుల్లితెర నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా, సింగర్ గా అన్నిటిలోనూ ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా చెప్పవచ్చు. రఘు కుంచె ఒక వెయ్యి కి పైగా పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించాడు. రఘు కుంచె ఈ మధ్య కాలంలో విలన్ గా నటిస్తూ ప్రేక్షకుల మదిని కొల్లగొడుతున్నాడు.
రఘుకుంచె సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో అతనితో పాటుగా సినిమా అవకాశాల కోసం వచ్చినవారిలో పూరీ జగన్నాధ్ , హీరో రవితేజ(Hero Raviteja) వంటి వారు కూడా ఉన్నారు. అయితే అప్పటి జ్ఞాపకాలను ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు రఘుకుంచె. ఇక అప్పట్లో రవితేజ నాకు జూనియర్. ఇక మేమిద్దరం పూరీ జగన్నాథ్ మంచి స్నేహితులం. వాళ్లిద్దరు పాటలు విని రిలాక్స్ అవ్వాలంటే నా రూమ్ కి వచ్చేవాళ్ళు. అసలు ఏం జరిగినది అంటే ….
ఓ రోజు నేను రవితేజ బైక్ మీద వెళ్తుంటే అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని ఆపి హెల్మెట్ లేదని అడిగాడు. వెంటనే రవితేజ బైక్ నాది కాదు వీడిది అంటూ నన్ను చూపించాడు.అప్పటికి ఇంకా రవితేజ సినిమాల్లో నటించడం లేదు. రవితేజ (Hero Raviteja)అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. అప్పటికి నేను సీరియల్ హీరో గా నటించే వాడిని ..
రవితేజ నన్ను చూపించగానే హెల్మెట్ తీశాను. వెంటనే గుర్తుపట్టిన ఆ పోలీస్ ఆఫీసర్ హెల్మెట్ మీరు పెట్టుకున్నారు మీరే బండి నడపవచ్చు కదా అని అన్నారు. ప్రస్తుతం రవితేజ (Hero Raviteja) టాప్ హీరోస్ లో ఒకరు. ఆ రోజును నేను ఇప్పటికీ మర్చిపోలేను. రవితేజ ఎక్కడ కలిసిన బాగా మాట్లాడుతాడు అంటూ తన జ్ఞాపకాలను పంచుకున్నాడు రఘు కుంచె.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb