Winter Skin Care: చంకలు గజ్జల్లో దురదలను తగ్గించే చిట్కా.

Winter Skin Care: చంకలు గజ్జల్లో దురదలను తగ్గించే చిట్కా.

Winter Skin Care: చంకలు గజ్జల్లో దురదలను తగ్గించే చిట్కా:

ఇప్పటివరకు మన కార్యక్రమంలో పెద్దల కోసం మాత్రమే బ్యూటీ టిప్స్ అందించాం. కానీ పిల్లలకూ అందం, చర్మ సంరక్షణ చాలా అవసరం. అందుకే ఈరోజు ప్రత్యేకంగా చలికాలంలో పిల్లలకు వచ్చే స్కిన్ అలర్జీలు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన(Winter Skin Care) జాగ్రత్తలను తెలుసుకుందాం.

చలికాలంలో పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో టీవీ ప్రకటనలు చూసి చిన్న పిల్లలకు కూడా కెమికల్స్ కలిసిన సబ్బులు, క్రీములు వాడుతున్నారు. కానీ వీటిని వీలైనంతవరకు దూరంగా ఉంచడం మంచిది. చిన్న పిల్లలకు సహజమైన పదార్థాలే చర్మానికి మేలు చేస్తాయి. సంప్రదాయంగా ఉపయోగించే సున్నిపిండి చాలా ఉత్తమమైనది.

Kidneys Health:కిడ్నీలు ఒక రోజుకు ఎంత సోడియం ని ఎలిమినేట్ చేస్తాయి తెలుసా మీకు?

పిల్లల చర్మ సంరక్షణకు కోల్డ్ ప్రెస్ చేసిన కొబ్బరి నూనె, బాదం నూనె లాంటివి చాలా మంచివి. రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా సహజ ఆయిల్స్ వాడాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా ఉంచి, పొడిబారకుండా (Winter Skin Care)కాపాడతాయి. అలాగే చర్మం సాఫ్ట్‌గా ఉండాలంటే పాల మీద మీగడ రాసి, ఐదు నుంచి పది నిమిషాలు మృదువుగా మర్దన చేసి, తర్వాత సున్నిపిండితో స్నానం చేయిస్తే చర్మం పగలకుండా, మంటలు లేకుండా ఉంటుంది.

చెల్లెమ్మ అంటూనే వంచన.. ఖమ్మం ప్రమీల ఘటనపై సంచలన నిజాలు!

పిల్లలకు దురదలు వస్తే ఇంట్లోనే పసుపు కొమ్మలను దంచి తయారు చేసిన పసుపును దురద ఉన్న చోట రాసి, అరగంట తర్వాత స్నానం చేయిస్తే సహజంగానే (Winter Skin Care)ఉపశమనం లభిస్తుంది. పసుపు మృతకణాలను తొలగించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

అందుకే పూర్వకాలం నుంచి వస్తున్న సున్నిపిండి, మీగడ, కొబ్బరి నూనె, పసుపు వంటి సహజ పదార్థాలను పిల్లల చర్మ సంరక్షణలో భాగంగా వాడితే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు.

Speed Healing Techniques:ఇన్ఫెక్షన్స్ నుండి త్వరగా రికవర్ అవుతారు ఇలా చేస్తే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *