ఆరోగ్యం కోసం నీరు తాగడం ఎంతో అవసరం అని అందరికీ తెలిసిందే. అయితే చాలామంది దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలని భావిస్తారు. కానీ నిపుణుల ప్రకారం దాహం వేయకముందే సరైన సమయాల్లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొంతమంది ఆకలి వేసినప్పుడే తినాలి కాబట్టి దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలి అని అనుకుంటారు. అయితే ఆకలి మరియు దాహం రెండు వేర్వేరు అవసరాలు. వీటిని ఒకేసారి తీర్చడం శరీరానికి అంతగా మంచిది కాదు.
చాలామందికి బ్రేక్ఫాస్ట్ లేదా భోజనం చేసేటప్పుడు దాహం వేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ముందుగా దాహం తీర్చకుండా భోజనం చేయడం వల్ల తినేటప్పుడు నీళ్లు తాగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆహారంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగితే జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు నీటితో కలిసిపోవడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదించే ప్రమాదం ఉంటుంది.
మా ప్రభుత్వం వచ్చాక మహిళల పేరు మీదే పథకాలు ఇస్తున్నాం..
అందుకే భోజనం చేసే ముందు కొంతసేపు ముందే నీళ్లు తాగడం మంచిదని సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీరు తాగడం శరీరానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో కూడా నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది.
బ్రేక్ఫాస్ట్ చేసే ముందు తగినంత నీరు తాగితే తినేటప్పుడు దాహం అనిపించదు. అలాగే ఆహారం జీర్ణం కావడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత వెంటనే నీళ్లు తాగకుండా కనీసం ఒకటి లేదా రెండు గంటల విరామం ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.
నిద్ర కంటి నిండా హాయిగా పట్టాలంటే……
రోజంతా కొద్దికొద్దిగా నీళ్లు తాగడం శరీరానికి అవసరమైన తేమను అందిస్తుంది. సాధారణంగా రోజుకు నాలుగు నుండి ఐదు లీటర్ల వరకు నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సరైన సమయాల్లో నీరు తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరం ఉత్సాహంగా ఉంటుంది.