సినీ నటి సమంత గారి Food Sequencing Technique ఇదే.

సినీ నటి సమంత గారి Food Sequencing Technique ఇదే.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ సరైన ఆహారం ఎంతో ముఖ్యమైనది. మనం భోజనంలో పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకున్నప్పటికీ వాటిని ఎలా తింటున్నామన్నది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చాలా మంది భోజనం చేసేటప్పుడు ఏది ముందు, ఏది తర్వాత అన్నది పట్టించుకోకుండా తింటారు. అయితే సరైన క్రమంలో ఆహారం తీసుకుంటే శరీరానికి లాభాలు మరింతగా పెరుగుతాయి. దీనినే “మీల్ సీక్వెన్సింగ్” అని అంటారు.

మీల్ సీక్వెన్సింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు సూచించే ఒక ఆహార పద్ధతి. ఈ విధానాన్ని పాటించడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించవచ్చు, అలాగే కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి. ఈ పద్ధతిని అనుసరించే వారు ఆరోగ్యంగా, చురుకుగా ఉండగలరని నిపుణులు చెబుతున్నారు.

వేస్ట్ నుంచి బెస్ట్..కొబ్బరి పీచుతో లక్షల్లో ఆదాయం.

ఈ పద్ధతిలో భోజనం ప్రారంభం సాలడ్‌తో చేయడం మంచిదని సూచిస్తారు. క్యారెట్, కీరదోస, క్యాప్సికం, లెట్యూస్ వంటి కూరగాయలతో చేసిన సాలడ్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేసి ఇతర ఆహారాలు రక్తంలో చక్కెరగా త్వరగా మారకుండా నియంత్రిస్తాయి. అలాగే పొట్టకు తేలికగా ఉండి తృప్తి భావాన్ని కలిగిస్తాయి.

సాలడ్ తిన్న తర్వాత రెండవ దశగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఉదాహరణకు పన్నీర్, సోయా పదార్థాలు, శెనగలు, బొబ్బర్లు, బటానీలు లేదా పప్పులతో చేసిన వంటకాలు తినవచ్చు. ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా తృప్తి కలిగి అధికంగా తినే అలవాటు తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ మెల్లగా జరిగి శరీరానికి అవసరమైన పోషకాలు సక్రమంగా అందుతాయి.

బాడీ లో రోగాలు రాకుండా ఎలా కాపాడుకోవాలి?

భోజనం చివర్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అన్నం, రొట్టెలు వంటి పిండి పదార్థాలను చివర్లో తీసుకుంటే అవి శరీరంలో త్వరగా చక్కెరగా మారకుండా ముందు తీసుకున్న ఫైబర్ మరియు ప్రోటీన్ నియంత్రణలో ఉంచుతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి.

ఇంకా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తినే ముందు చియా సీడ్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఇవి జీర్ణక్రియను సమతుల్యం చేసి శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా సహాయపడతాయి.

మా ప్రభుత్వం వచ్చాక మహిళల పేరు మీదే పథకాలు ఇస్తున్నాం..

మొత్తానికి సాలడ్‌తో ప్రారంభించి, తరువాత ప్రోటీన్ ఆహారం తీసుకుని, చివర్లో కార్బోహైడ్రేట్లు తినే విధానాన్ని పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ మీల్ సీక్వెన్సింగ్ పద్ధతి బరువు నియంత్రణకు, చక్కెర వ్యాధి నివారణకు, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

భోజనం చేసేటప్పుడు దాహం ఎందుకు వేస్తుంది? శరీరం ఇచ్చే సిగ్నల్ ఇదే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *