ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన ఆహారపు అలవాట్లలో మార్పు అవసరం. సాధారణంగా మనకు అన్నం అంటే బియ్యంతో చేసిన భోజనం మాత్రమే అనిపిస్తుంది. అయితే ఎక్కువగా బియ్యం తినడం వల్ల బరువు పెరగడం, షుగర్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ చాలా మంది బియ్యంపై ఆధారపడుతూ ఉంటారు.
ఈ పరిస్థితిలో బియ్యానికి మంచి ప్రత్యామ్నాయంగా తోటకూర గింజలతో తయారు చేసే అన్నం (అమరాంత్ సీడ్స్ రైస్) ఉపయోగపడుతుంది. ఇవి సాధారణ ధాన్యాల్లాగే వండుకుని తినవచ్చు. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం తోటకూర గింజల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల గింజల్లో సుమారు 14 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన..! తక్షణం అలా చేయండి..!
ఈ గింజలతో చేసిన అన్నం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ఇది ముఖ్యంగా డయాబెటిస్ మరియు బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగకరం. అలాగే అధిక ఫైబర్, ప్రోటీన్ ఉండటం వల్ల తక్కువ పరిమాణంలో తిన్నా తృప్తి కలుగుతుంది.
బియ్యం తో పోలిస్తే తోటకూర గింజల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది.
బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందే 3 ఆహారాలు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తోటకూర గింజలను సాధారణ అన్నంలా వండుకుని ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే మైక్రో గ్రీన్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలను అలవాటు చేస్తే భవిష్యత్తులో మంచి ఆరోగ్యానికి పునాది పడుతుంది.
మొత్తంగా చూస్తే తోటకూర గింజల అన్నం బియ్యానికి మంచి ప్రత్యామ్నాయం మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరచే పోషకాహారం అని చెప్పవచ్చు.
మహిళలకు గుడ్ న్యూస్: ఏసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, కాలేజీ అమ్మాయిలకు ఈ-స్కూటీ యోజన.