మోకాళ్ళ నొప్పి పోయి లేచి పరుగెడుతారు.

మోకాళ్ళ నొప్పి పోయి లేచి పరుగెడుతారు.

ఇటీవల కాలంలో మోకాళ్ల నొప్పులు కేవలం వృద్ధులకే పరిమితం కాకుండా యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీవనశైలి మార్పులు, పోషకాహార లోపాలు, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

మోకాళ్ల నొప్పి ప్రారంభ దశలోనే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. కొద్దిసేపు కూర్చుని లేచిన వెంటనే కాళ్లలో బిగుతు, తిమ్మిర్లు, బరువుగా అనిపించడం, టక్ టక్ శబ్దాలు వినిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే మోకాళ్ల కీళ్ల దెబ్బతినే ప్రమాదం ఉంది.

లివర్ ని శుభ్రం చేసే పవర్ ఫుల్ డ్రింక్.

మోకాళ్ల నొప్పులకు కారణాలను తెలుసుకోవడానికి కాల్షియం, విటమిన్ B12 వంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం. శరీరంలో ఈ పోషకాల కొరత ఎక్కువకాలం కొనసాగితే ఎముకల సాంద్రత తగ్గి, మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

అధిక బరువు కూడా మోకాళ్లపై ఒత్తిడిని పెంచి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే రోజూ కొంత సమయం వ్యాయామం చేయడం, కాళ్ల కండరాలను బలపరిచే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.

ఇంటి చిట్కాగా నువ్వుల నూనె లేదా ఆముదం నూనెలో తమలపాకులు, మెంతులు, కర్పూరం, వాము పువ్వు, పుదీనా పువ్వు వేసి మరిగించి తయారు చేసిన నూనెను మోకాళ్ల చుట్టూ మసాజ్ చేయడం ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి.

ఆహారంలో కాల్షియం, ఐరన్, ఖనిజాలు అధికంగా ఉండే మునగాకు, మునగకాయలు, నువ్వులు, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ వంటి వాటిని చేర్చుకోవడం మంచిది. ఇవి ఎముకల బలాన్ని పెంచడంతో పాటు కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

నిద్రలో కండరాలు పట్టేస్తున్నాయా? కారణాలు, నివారణ మార్గాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

అలాగే తగినంత నీరు తాగడం, దానిమ్మ రసం తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం, రోజువారీ శారీరక శ్రమను పెంచుకోవడం ద్వారా రక్తప్రసరణ మెరుగుపడి కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది.

మోకాళ్ల నొప్పులు ఎక్కువ కాలం కొనసాగితే లేదా నడవడంలో ఇబ్బంది కలిగిస్తే స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ప్రారంభ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ల శస్త్రచికిత్స అవసరాన్ని కూడా చాలా వరకు నివారించవచ్చు.

ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులు.. రూ.200 కోట్ల అక్రమాస్తులు?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *