బీపీ కూడా సైలెంట్ కిల్లరే.. జీవనశైలి మారిస్తే నియంత్రణ సాధ్యమని నిపుణుల సూచన

బీపీ కూడా సైలెంట్ కిల్లరే.. జీవనశైలి మారిస్తే నియంత్రణ సాధ్యమని నిపుణుల సూచన

ప్రస్తుతం అధిక రక్తపోటు (బీపీ) సమస్య యువతలోనూ వేగంగా పెరుగుతోంది. ఇది గుండె, మెదడు, కిడ్నీలు, రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపే సైలెంట్ కిల్లర్‌గా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీకి ఒక్క కారణం ఉండదని, ఇన్సులిన్ రెసిస్టెన్స్, కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు, ఇతర జీవక్రియ లోపాలు వంటి అనేక అంశాలు దీనికి దారితీయవచ్చని చెబుతున్నారు.

చాలా సందర్భాల్లో జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా బీపీని నియంత్రించవచ్చని, కొంతమందిలో మందుల మోతాదును తగ్గించే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వైద్యుల సలహా లేకుండా మందులు ఆపడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక బీపీని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులు.. రూ.200 కోట్ల అక్రమాస్తులు?

బీపీ నియంత్రణలో క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణ, ధ్యానం వంటి అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా రీల్స్ చూడడం వల్ల నిద్రలేమి ఏర్పడి, బీపీతో పాటు షుగర్ నియంత్రణ కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆహారంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు అధిక చక్కెర కలిగిన పానీయాలను తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు. వేసవిలో శరీరానికి తగినంత ద్రవాలు అందేలా చూసుకోవాలని, కూల్‌డ్రింక్స్‌కు బదులుగా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి సహజ పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.

షుగర్, బీపీకి అసలు కారణం తీపి పదార్థాలేనా? జీవనశైలే కీలకమంటున్న వైద్య నిపుణులు

మొత్తంగా బీపీ, షుగర్ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులను క్రమబద్ధమైన ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ ద్వారా చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

హెయిర్ డైలకు బదులుగా హెన్నా.. తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చే చిట్కాలు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *