ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్నారు ప్రముఖ వైద్యుడు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్. అయితే తాను వీడియోలు చేసిన ఉద్దేశ్యం పేషెంట్లు ఎక్కువగా రావడం కాదని, ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని డాక్టర్ల అవసరం లేకుండా జీవించాలని మాత్రమే తన కోరిక అని ఆయన స్పష్టం చేశారు.
“ప్రపంచంలో ఎవరికీ డాక్టర్ అవసరం రాకూడదు” అనే భావనతోనే తాను వీడియోలు చేస్తున్నానని ఆయన చెప్పారు. పేషెంట్లను డబ్బు కోసం కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటానని, అవసరమైతేనే టెస్టులు రాస్తానని, సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో వైద్యం అందించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
షుగర్ పూర్తిగా కంట్రోల్…7 రోజుల్లో బ్లడ్ షుగర్ నార్మల్.
వైరల్ అయిన వీడియోలో కన్నీళ్లు పెట్టుకోవడంపై స్పందిస్తూ, ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడటం తనకు బాధ కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే బీపీ, షుగర్, హార్ట్ స్ట్రోక్, పక్షవాతం వంటి సమస్యలు రావడం చూసి తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
రిఫైన్డ్ ఆయిల్స్, అధిక కార్బోహైడ్రేట్లు, చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్, ఆధునిక జీవనశైలి వల్లే చాలా వ్యాధులు వస్తున్నాయని డాక్టర్ విక్రాంత్ తెలిపారు. “మన జీవన విధానం మారాలి. పాతకాలపు ఆహార అలవాట్లు తిరిగి రావాలి” అని సూచించారు. ఉదయం చక్కెర టీకి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, రోజుకు రెండు పూటల భోజనం చాలనన్నారు.
ఎన్టీఆర్ నో చెప్పిన స్టోరీ కి.. బన్నీఓకే చెప్పాడా.?
వెజిటేరియన్స్ తప్పనిసరిగా పెరుగు, ప్రోటీన్ ఆహారం తీసుకోవాలని, నెయ్యిని భయపడాల్సిన అవసరం లేదని, అసలు ప్రమాదం అధిక చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్లేనని వివరించారు.
డాక్టర్ విక్రాంత్ వీడియోలు చూసి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక మంది పేషెంట్లు ఆస్పత్రికి వస్తున్నారు. “ఈ డాక్టర్ ప్రేమతో మాట్లాడుతున్నారు, కుటుంబ సభ్యుల్లా చూస్తున్నారు” అంటూ పేషెంట్లు భావోద్వేగంతో చెబుతున్నారు.
ఈ 5 వస్తువులు ఫ్రిజ్‌లో పెడితే… కడుపు నాశనం.
కరీంనగర్‌లోని టైమ్ న్యూరోకేర్ హాస్పిటల్ వద్ద ఉదయం నుంచే భారీగా పేషెంట్లు క్యూలు కడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన చెప్పే ఆరోగ్య సూచనలు, జీవనశైలి మార్పులపై ఇచ్చే అవగాహన ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.