ఈ 5 వస్తువులు ఫ్రిజ్‌లో పెడితే… కడుపు నాశనం.

ఈ 5 వస్తువులు ఫ్రిజ్‌లో పెడితే… కడుపు నాశనం.

ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిజ్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. బిజీ జీవితశైలిలో మిగిలిన ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్ ఉపయోగపడుతున్నా, సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్, పాల పదార్థాలు లేదా బయట నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని సరిగా వేడి చేయకుండా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వొచ్చని చెబుతున్నారు.

డాక్టర్ శ్రీనివాస్ కే సైలస్ మాట్లాడుతూ ఫ్రిజ్ తప్పు కాదని, దాన్ని ఉపయోగించే విధానమే ముఖ్యమని తెలిపారు. ఫ్రిజ్ టెంపరేచర్ సరిగా ఉండాలి, డోర్ రబ్బర్ బిగుతుగా ఉండాలి, నెలకోసారి శుభ్రపరచాలని సూచించారు. బయట హోటళ్ల నుంచి తెచ్చుకున్న ఫుడ్‌లో టేస్టింగ్ సాల్ట్స్, రసాయనాలు ఎక్కువగా ఉండటంతో వాటిని ఎక్కువసేపు నిల్వ చేస్తే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉందన్నారు. అలాంటి ఆహారాన్ని తప్పనిసరిగా బాగా వేడి చేసి మాత్రమే తినాలని సూచించారు.

ఈ 3 అల్పాహారాలు తినడం మానేయండి,ఆరోగ్యానికి ఉత్తమమైన అధిక ప్రోటీన్ ఆహారాలు.

ప్లాస్టిక్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్‌ను డీప్ ఫ్రీజర్‌లో ఎక్కువసేపు ఉంచడం కూడా మంచిది కాదని చెప్పారు. అరటిపండ్లు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదని, ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అలాగే పన్నీర్, మష్రూమ్స్, ఐస్‌క్రీమ్ వంటి పదార్థాలను ఎక్స్‌పైరీ డేట్ దాటిన తర్వాత వాడకూడదన్నారు.

మిగిలిన ఆహారాన్ని స్టీల్ పాత్రల్లో మూతపెట్టి నిల్వ చేయడం మంచిదని, ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే తినకుండా బాగా వేడి చేసి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన విధంగా వాడితే ఫ్రిజ్ ఆరోగ్యానికి హాని కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఎన్టీఆర్ నో చెప్పిన స్టోరీ కి.. బన్నీఓకే చెప్పాడా.? 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *