ఈ 3 అల్పాహారాలు తినడం మానేయండి,ఆరోగ్యానికి ఉత్తమమైన అధిక ప్రోటీన్ ఆహారాలు.

ఈ 3 అల్పాహారాలు తినడం మానేయండి,ఆరోగ్యానికి ఉత్తమమైన అధిక ప్రోటీన్ ఆహారాలు.

ప్రస్తుత జీవనశైలిలో చిన్న వయసులోనే బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు సూచిస్తున్నారు. ఇడ్లీ, దోస, పూరీ వంటి ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఉదయం తీసుకునే మొదటి ఆహారంలో ప్రోటీన్, మంచి కొవ్వులు ఉండటం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నాన్ వెజిటేరియన్స్ అయితే కోడిగుడ్లు మంచి ఎంపిక కాగా, వెజిటేరియన్స్‌కు మొలకలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయల సలాడ్స్ ఉపయోగకరమని చెబుతున్నారు. రాత్రి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ను ఉదయం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.

రోజుకు మూడు నాలుగు సార్లు తినడం కంటే రెండు సార్లు మాత్రమే పరిమితంగా భోజనం చేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఒకసారి, సాయంత్రం సూర్యాస్తమయం ముందు మరోసారి భోజనం చేస్తే శరీరానికి సరిపోతుందని పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్నం పూర్తిగా మానేయడం సాధ్యం కాకపోయినా, తక్కువ పరిమాణంలో తీసుకుని దానితో పాటు ప్రోటీన్, ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

దీన్ని ఇలా వాడితే స్కిన్ గ్లో వంద రెట్లు పెరుగుతుంది.

వెజిటేరియన్స్ తప్పనిసరిగా పెరుగు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే విటమిన్ B12 ఎక్కువగా పాలు, పెరుగులో లభిస్తుందని, అవసరమైతే సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.

కొలెస్ట్రాల్ గురించి ఉన్న అపోహలపై కూడా వైద్యులు స్పందిస్తున్నారు. నాన్ వెజ్ తింటేనే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భావించడం సరైంది కాదని చెబుతున్నారు. అసలు సమస్య అధికంగా చక్కెర, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల వస్తుందని వివరిస్తున్నారు. శరీరంలో ఒక్కసారిగా గ్లూకోజ్ పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి బీపీ, షుగర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

ఎన్టీఆర్ నో చెప్పిన స్టోరీ కి.. బన్నీఓకే చెప్పాడా.? 

నెయ్యి విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదని, పరిమితంగా తీసుకుంటే అది శరీరానికి ఉపయోగకరమేనని నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లలకు చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ ఇవ్వడంపై జాగ్రత్తలు తీసుకోకుండా, నెయ్యిని మాత్రం భయపడటం సరికాదని అంటున్నారు.

చిన్న వయసులోనే పక్షవాతం, గుండెపోటుతో బాధపడుతున్న యువతను చూస్తే చాలా బాధ కలుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుంటే అనేక వ్యాధులను నివారించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.

దండం పెట్టి చెప్తున్నా ఎవ్వరు ఊహించనంత గా కొవ్వు కరుగుతుంది.

వడదెబ్బ తగలకుండా చూసుకోవాలనుకుంటున్నారా? మీ బాడి ని కూల్ చేసే ఫుడ్స్ ఇవే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *