ప్రస్తుతం సమాజంలో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. చాలా మంది “కొంచెం లావుగా ఉంటే ఏమవుతుంది?” అని నిర్లక్ష్యం చేస్తున్నా, దాని వెనుక దాగి ఉన్న ఆరోగ్య ప్రమాదాలు మాత్రం తీవ్రమైనవే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, బీపీ, షుగర్, డయాబెటీస్ వంటి సమస్యలకు ప్రధాన కారణం “ఇన్సులిన్ రెసిస్టెన్స్” అని వైద్యులు చెబుతున్నారు.
అధికంగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, తరచూ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ ఇన్సులిన్ శరీరంలో కొవ్వు నిల్వ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే విజరల్ ఫ్యాట్ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదకర సమస్యలకు దారితీస్తుంది. జాయింట్ పెయిన్స్ నుంచి క్యాన్సర్ వరకు కూడా ఊబకాయం ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీన్ని ఇలా వాడితే స్కిన్ గ్లో వంద రెట్లు పెరుగుతుంది.
ఇప్పటి సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఈ సమస్యలకు ప్రధాన కారణంగా మారింది. గంటల తరబడి కూర్చుని పని చేసే ఉద్యోగుల్లో బీపీ, షుగర్, ఊబకాయం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ప్రతి గంటకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవడం లేదా 10 స్క్వాట్స్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు నడిస్తే గ్లూకోజ్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది.
నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం సూర్యకాంతిలో కొద్దిసేపు గడపడం వల్ల శరీరంలోని సర్కేడియన్ రిథమ్ సరిగా పనిచేసి రాత్రి నిద్ర బాగా పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాత టీ, కాఫీ వంటి క్యాఫేన్ పానీయాలు తగ్గించడం, సాయంత్రం త్వరగా భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.
మంగ్లీ భాగోతం బయటపెట్టిన అడ్వకేట్ సుబ్బారావు.
రోజుకు రెండు సార్లు మాత్రమే పరిమిత ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ పెంచుకోవడం ద్వారా అనేక జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లలు, గర్భిణీలు, షుగర్ పేషెంట్లు మాత్రం వైద్యుల సలహా మేరకు ఆహార నియమాలు పాటించాలి.
అంతేకాదు, ప్రతి లావుగా ఉన్న వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తాయని కాదు. కొందరు బరువు ఎక్కువగా ఉన్నా యాక్టివ్‌గా ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. అందుకే కేవలం బరువుకన్నా శరీర పనితీరు, ఫిట్‌నెస్ ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవల్స్ పరీక్షించుకోవడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు.
వడదెబ్బ తగలకుండా చూసుకోవాలనుకుంటున్నారా? మీ బాడి ని కూల్ చేసే ఫుడ్స్ ఇవే.
జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఊబకాయం, బీపీ, షుగర్ వంటి సమస్యలకు చాలా వరకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.