మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లో గుండె మరియు మెదడు అత్యంత ముఖ్యమైనవి. ఈ రెండు అవయవాలు సరిగా పనిచేస్తేనే శరీరంలోని మిగతా అవయవాల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా మెదడు మరియు నర వ్యవస్థ (నర్వస్ సిస్టమ్) ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. జీవితాంతం నరాలు బలంగా ఉండాలంటే మెదడు లోపల జరిగే డీటాక్స్ ప్రక్రియ సరిగా జరగాలి.
మన శరీరంలో ఒక సహజమైన “ఆటో డీటాక్స్ మెకానిజం” ఉంటుంది. కానీ అది పనిచేయాలంటే మన జీవన విధానం, ముఖ్యంగా ఆహారం మరియు నిద్ర చాలా కీలకం. మనం సరైన ఆహారం తీసుకుంటూ, సరైన సమయానికి తింటే మెదడు రాత్రి సమయంలో తనంతట తాను శుభ్రం చేసుకునే అవకాశం పొందుతుంది.
విటమిన్ ఈ రిచ్ గా ఉండే పప్పు ఇదే.
మనిషి రోజంతా ఆలోచనలు చేస్తూ, పనులు చేస్తూ ఉంటాడు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మెదడు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఆలోచనలు చేయడం వల్ల మెదడు కణాల నుంచి కొన్ని కెమికల్స్ విడుదల అవుతాయి. వాటిలో ఒకటి బీటా అమిలాయిడ్ (Beta Amyloid) అనే ప్రోటీన్. మనం రోజంతా మెలుకువగా ఉండే 15–18 గంటల సమయంలో ఈ ప్రోటీన్ విడుదల అవుతుంటుంది.
రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. ఈ విశ్రాంతి సమయంలో రోజంతా ఏర్పడిన ఆ వ్యర్థ కెమికల్స్‌ను మెదడు శుభ్రం చేస్తుంది. సాధారణంగా 6 గంటల లోపల ఈ క్లీనింగ్ ప్రక్రియ జరిగితే మెదడు కణాలు మళ్లీ తాజాగా మారి, శక్తివంతంగా పనిచేస్తాయి.ఈ డీటాక్స్ ప్రక్రియ సరిగా జరగాలంటే మనం రెండు విషయాల్లో మెదడుకు సహాయం చేయాలి.
మొదటిది – సాయంత్రం త్వరగా భోజనం చేయడం.
రెండవది – ఒమేగా–3 ఫ్యాట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.
మహిళలకు గుడ్ న్యూస్: ఏసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, కాలేజీ అమ్మాయిలకు ఈ-స్కూటీ యోజన.
సాయంత్రం 5 లేదా 6 గంటలలోపే డిన్నర్ పూర్తి చేస్తే మంచిది. ఎందుకంటే పడుకునే సమయానికి ఆహారం పూర్తిగా జీర్ణం అయిపోవాలి. సాధారణంగా రాత్రి 9 గంటల తరువాత జీర్ణక్రియ ఆగిపోతుంది. ఆ సమయంలో శరీరంలో “ఆటోఫాజీ” అనే ఆటో రిపేర్ మరియు ఆటో క్లీనింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది మెదడు మరియు శరీర కణాలను శుభ్రం చేస్తుంది.
అయితే రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే జీర్ణక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు ఈ ఆటోఫాజీ ప్రక్రియ సరిగా జరగదు. దాంతో మెదడులో ఏర్పడిన వ్యర్థ పదార్థాలు పూర్తిగా తొలగిపోవు. ఇవి ఎక్కువ కాలం పేరుకుపోతే మతిమరుపు వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే సాయంత్రం త్వరగా భోజనం చేయడం మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇక రెండవ విషయం – ఒమేగా–3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి మెదడు మరియు నరాలకు చాలా అవసరం. చాలా మంది ఒమేగా–3 చేపల్లో ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ కొన్ని విత్తనాల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి.
సినీ నటి సమంత గారి Food Sequencing Technique ఇదే.
ఉదాహరణకు:
- చియా సీడ్స్ – సుమారు 18 గ్రాముల ఒమేగా ఫ్యాట్
- ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) – సుమారు 13 గ్రాములు
- వాల్నట్స్ – సుమారు 11 గ్రాములు
- బాదం – సుమారు 9 గ్రాములు
ఇవే కాకుండా గుమ్మడికాయ గింజలు, సూర్యకాంతి గింజలు వంటి విత్తనాల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి.
ఈ గింజలను 6–8 గంటలు నానబెట్టి తింటే ఇంకా మంచిది. వీటితో పాటు కిస్మిస్, అంజీర్, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ విషయానికి వస్తే జామకాయ, నేరేడు, దానిమ్మ, రేగు వంటి సీజనల్ పండ్లు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాయి. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ కూడా మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి.
వేస్ట్ నుంచి బెస్ట్..కొబ్బరి పీచుతో లక్షల్లో ఆదాయం.
ఈ విధంగా సాయంత్రం త్వరగా భోజనం చేయడం, ఒమేగా–3 మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో మెదడు తనను తాను శుభ్రం చేసుకొని మరుసటి రోజు తాజాగా తయారవుతుంది. అప్పుడు మెదడు కణాలు రిఫ్రెష్ అయి, శక్తివంతంగా పనిచేస్తాయి.
అందుకే మతిమరుపు సమస్యలు లేకుండా, నిద్ర బాగా ఉండటానికి మరియు మెదడు ఆరోగ్యంగా ఉండటానికి ఎర్లీ డిన్నర్, ఒమేగా–3 మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న సహజ ఆహారం అత్యంత ముఖ్యమైనవి. ఇదే నిజమైన ఆరోగ్య రహస్యం.
బాడీ లో రోగాలు రాకుండా ఎలా కాపాడుకోవాలి?