ఈరోజుల్లో చాలామంది స్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనె రాసుకుంటారు. కానీ పూర్వం కాలంలో మాత్రం స్నానం చేసిన తర్వాత శరీరానికి కొబ్బరి నూనె రాసుకునే అలవాటు ఉండేది. మన పెద్దలు పాటించిన ఈ పద్ధతిలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని ఇప్పుడు మళ్లీ మనం గ్రహిస్తున్నాం.
స్నానం అనంతరం కొద్దిగా కొబ్బరి నూనె శరీరానికి రాసుకోవడం వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె అయితే మరింత మంచిది. పూర్వం ఇంట్లోనే కొబ్బరి ముక్కలను ఎండబెట్టి నూనె తయారు చేసుకునేవారు. ఇప్పుడు అదే విధానంలో తయారయ్యే కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి చర్మానికి సహజ రక్షణను అందిస్తాయి.
తిరుమల 1970 లో ఎలా వున్నదో చూడండి.
స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. చాలామంది వాడే క్రీములు, లోషన్లు కొన్ని గంటలకే ప్రభావం కోల్పోతాయి. కానీ కొబ్బరి నూనె రోజంతా చర్మాన్ని మృదువుగా, సాఫ్ట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మం తెల్లగా పొట్టు రాలడం, డ్రైగా మారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
వేసవికాలంలో బయటకు వెళ్లేటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాసుకోవడం చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎండలో ఉండే హానికర కిరణాలు నేరుగా చర్మంపై ప్రభావం చూపకుండా ఇది సహాయపడుతుంది. అందువల్ల చర్మం మండటం, చురుచురలాడటం వంటి సమస్యలు తగ్గుతాయి.
బాడీలో నీరసం అలసట తగ్గుతుంది ఈ సూప్ ను రోజూ తాగితే..
అంతేకాదు, కొబ్బరి నూనెలో సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. గాలిలో ఉండే బ్యాక్టీరియా, హానికర క్రిములు చర్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లకుండా ఇది కొంతవరకు రక్షణ కల్పిస్తుంది. చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే, కొబ్బరి నూనె చర్మంలోని లోపలి పొరలకు తేమను అందిస్తుంది. చర్మంలో ఉండే కొలాజన్, ఎలాస్టిన్ బ్యాండ్స్ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. దీంతో స్ట్రెచ్ మార్క్స్, ముడతలు త్వరగా రావడం తగ్గుతుంది. విటమిన్–E వంటి పోషకాలు చర్మానికి సహజ కాంతిని అందిస్తాయి.
మంగ్లీ భాగోతం బయటపెట్టిన అడ్వకేట్ సుబ్బారావు.
చలికాలంలో చాలామందికి చర్మం పొడిబారి తెల్లగా మారుతుంది. అలాంటి సమస్యలను కూడా కొబ్బరి నూనె తగ్గించగలదు. ప్రతిరోజూ ఎక్కువగా కాకుండా రెండు మూడు చుక్కలు మాత్రమే రాసుకున్నా చర్మం నిగారింపుతో మెరిసిపోతుంది.
ఈరోజుల్లో కెమికల్స్ ఉన్న సబ్బులు, క్రీములు ఎక్కువగా వాడటం వల్ల చర్మం సహజ తేమ కోల్పోతుంది. అందుకే సహజమైన పద్ధతుల వైపు మళ్లడం మంచిది. మన పెద్దలు పాటించిన ఈ చిన్న అలవాటు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనె నిజంగా చర్మానికి ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
మీ జుట్టు ఇక ఊడదు దీన్ని ఇలా వాడితే….