ఆరోగ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు. కరివేపాకు అంటే సాధారణంగా కంటి చూపు కోసం ఉపయోగపడే విటమిన్ A గుర్తుకు వస్తుంది. కానీ జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుందనే విషయం ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమైంది.
కరివేపాకులో ఉండే ఫైటోకెమికల్స్—టెర్పినాయిడ్స్, ఆల్కలాయిడ్స్—యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో స్కాల్ప్‌ను రక్షిస్తాయి. కరివేపాకు ఆయిల్‌ను తలకు రాస్తే చుండ్రు, దురద తగ్గి, ఇన్ఫెక్షన్లు తగ్గి జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా మారతాయి.
మీ జుట్టు రాలుతోందా బట్టతల కాకముందే ఈ వైరల్ డాక్టర్ చిట్కాలు పాటించండి.
రెండవ ముఖ్యమైన ప్రయోజనం, ఇది జుట్టు నల్లరంగును కాపాడటంలో సహాయపడుతుంది. మన జుట్టుకు రంగు ఇచ్చే మెలనిన్ ఉత్పత్తిని కాపాడే మెలనోసైట్స్ కణాలను రక్షించడంలో కరివేపాకు సహాయపడుతుంది. దీంతో ముందుగానే జుట్టు తెల్లబడటాన్ని కొంతవరకు నివారించవచ్చు.
మూడవది, కరివేపాకులో ఉన్న అమినో యాసిడ్లు, కెరోటిన్స్, విటమిన్ C, కాల్షియం వంటి పోషకాలు జుట్టు వేర్లను బలపరచి, కెరటిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల జుట్టు బలంగా, దట్టంగా పెరుగుతుంది.
సర్కార్ బడిలో అడ్మిషన్ కోసం పోటెత్తిన జనం.
కరివేపాకును రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. కరివేపాకు పొడిని కూరల్లో, దోశ, ఇడ్లీ పిండిలో కలపడం లేదా జ్యూస్‌లో వేసుకోవడం ద్వారా తీసుకోవచ్చు. అలాగే మార్కెట్‌లో లభించే కరివేపాకు ఆయిల్‌ను కూడా తలకు అప్లై చేయవచ్చు.
మొత్తానికి, కరివేపాకు అంతర్గతంగా, బాహ్యంగా ఉపయోగించినప్పుడు జుట్టు ఆరోగ్యానికి మూడు ప్రధాన లాభాలు అందించి, సహజంగా దృఢంగా, అందంగా పెరగడానికి సహాయపడుతుంది.