ఆరోగ్యకరమైన కిడ్స్ ఫుడ్‌లో భాగంగా పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడే సహజ ఔషధాల్లో బ్రహ్మి (సరస్వతి ఆకు) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఆయుర్వేదంలో ఎంతో ప్రాచీనంగా ఉపయోగించే ఈ మొక్క మెమరీ, ఫోకస్, కాన్సంట్రేషన్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బ్రహ్మి ఆకుల్లో ఉన్న పలు ఫైటోకెమికల్స్ మెదడు కాగ్నిటివ్ ఫంక్షన్స్‌ను మెరుగుపరుస్తాయి. నర్వ్ సెల్స్ మధ్య సిగ్నల్ ట్రాన్స్‌మిషన్‌ను వేగవంతం చేసి, ఆలోచనా శక్తిని, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. అందుకే దీనిని సరస్వతి ఆకు అని కూడా పిలుస్తారు.
వారానికి ఒక్క రోజు ఇలా చేస్తే బరువు ఈజీగా తగ్గొచ్చు.
ఇది ప్రతి ఒక్కరికీ తాజాగా దొరకకపోయినా, పొడి రూపంలో సులభంగా ఉపయోగించుకోవచ్చు. అర స్పూన్ బ్రహ్మి పొడిలో ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె కలిపి రోజూ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటి సహజ పద్ధతులు అలవాటు చేస్తే, వారి మెదడు అభివృద్ధి మెరుగ్గా ఉంటుంది.
పిల్లలతో పాటు పెద్దవారికి కూడా ఇది ప్రయోజనకరం. ముఖ్యంగా చదువుతున్న పిల్లలలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచడానికి బ్రహ్మి ఒక మంచి సహజ పరిష్కారం. అయితే, ఏదైనా కొత్త ఆహారం లేదా ఔషధం ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
తిరుమల 1970 లో ఎలా వున్నదో చూడండి.