ప్రఖ్యాత ఆయుర్వేద వైద్య నిపుణులు మధుసూదన్ శర్మ గారు గత 40 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యంలో విశేష సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా షుగర్ వ్యాధి, ముఖ్యంగా HbA1c స్థాయిల నియంత్రణపై ఆయన పలు ముఖ్యమైన సూచనలు చేశారు.
ఈ రోజుల్లో చాలా మంది నెలనెలా షుగర్ టెస్టులు చేయించుకునే ముందు ఆహారాన్ని తగ్గించి తాత్కాలికంగా షుగర్ లెవెల్స్ తగ్గినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మూడు నెలల సగటు షుగర్ స్థాయిని తెలిపే HbA1c పరీక్షలో అసలు పరిస్థితి బయటపడుతుందని ఆయన తెలిపారు. అందుకే కేవలం పరీక్షల కోసం కాకుండా నిజంగా జీవనశైలిని మార్చుకోవడం అవసరమని సూచించారు.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..ఫ్యాటీ లివర్ తగ్గించే డ్రింక్.
ప్రపంచంలోనే భారతదేశం షుగర్ వ్యాధిలో అగ్రస్థానంలో ఉండటం ఆందోళనకరమని, ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ వ్యాధి వేగంగా పెరుగుతోందని అన్నారు. చిన్న వయసులోనే మధుమేహం రావడం, మందులు వేసుకున్నా నియంత్రణలోకి రాకపోవడం ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిందన్నారు.
షుగర్ నియంత్రణలో ఉండాలంటే మూడు విషయాలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. సరైన ఆహారం, సరైన ఔషధాలు, రోజువారీ వ్యాయామం — ఈ మూడు కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. షుగర్ ఎక్కువగా ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మందులు, అవసరమైతే ఇన్సులిన్ కూడా తీసుకోవాలని సూచించారు.
ఈ 3 అల్పాహారాలు తినడం మానేయండి,ఆరోగ్యానికి ఉత్తమమైన అధిక ప్రోటీన్ ఆహారాలు.
ఆహారంలో మల్టీగ్రెయిన్ రోటీలు లేదా పుల్కాలు వాడటం మంచిదన్నారు. వాటిలో కసూరి మేతి (ఎండబెట్టిన మెంతి ఆకులు) కలిపి తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ నియంత్రణలోకి రావడానికి సహాయపడుతుందని చెప్పారు. అదేవిధంగా రోజుకు రెండు సార్లు పెరుగులో వేయించిన మెంతుల పొడి కలిపి తీసుకోవడం కూడా మధుమేహ నియంత్రణకు ఉపయోగకరమని వివరించారు.
ఉసిరిక పొడిని పల్చని తాజా మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ రక్షణ పొందడమే కాకుండా శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ ప్రభావం పెరుగుతుందని తెలిపారు. ఉసిరిలో ఉన్న విటమిన్-C మరియు ఇతర పోషకాలు ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరుస్తాయని చెప్పారు.
ఎన్టీఆర్ నో చెప్పిన స్టోరీ కి.. బన్నీఓకే చెప్పాడా.?
షుగర్ నియంత్రణలో లేకపోతే గుండె, కిడ్నీలు, కళ్ళు, నరాలు, చర్మం, రక్తనాళాలు వంటి శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. అందుకే షుగర్‌ను నిర్లక్ష్యం చేయకుండా నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు.
ఇంట్లోనే తయారు చేసుకునే ఒక ప్రత్యేక ఆయుర్వేద మిశ్రమాన్ని కూడా ఆయన వివరించారు. పొడపత్రి చూర్ణం, నేరేడు విత్తనాల పొడి, ఉసిరిక పొడి, పసుపు — ఇవన్నీ ఒక్కోటి 50 గ్రాముల చొప్పున కలిపి తయారు చేసుకోవాలని చెప్పారు. ఈ మిశ్రమాన్ని ఉదయం, రాత్రి భోజనానికి 10 నిమిషాల ముందు అర టీ స్పూన్ నీటిలో కలిపి తీసుకుంటే షుగర్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుందని తెలిపారు.
ఈ 5 వస్తువులు ఫ్రిజ్‌లో పెడితే… కడుపు నాశనం.
పొడపత్రి తీపి ప్రభావాన్ని తగ్గించడంలో, నేరేడు మూత్ర సమస్యలను తగ్గించడంలో, ఉసిరిక అవయవాలను రక్షించడంలో, పసుపులోని కుర్కుమిన్ ఇన్ఫెక్షన్లు మరియు వాపులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.
అయితే ఈ ఆయుర్వేద చిట్కాలను వైద్యుల సలహాతో పాటు మాత్రమే పాటించాలని, ఇప్పటికే వాడుతున్న మందులను స్వయంగా ఆపకూడదని ఆయన స్పష్టం చేశారు. సరైన ఆహారం, వ్యాయామం, వైద్యుల సూచనలు మరియు ఆయుర్వేద సహజ చిట్కాలను కలిపి పాటిస్తే మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చని తెలిపారు.