ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో ఈ సమస్య మరింత ఆందోళనకర స్థాయికి చేరుకుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. గతంలో మద్యం సేవించే వారిలో మాత్రమే కనిపించే ఫ్యాటీ లివర్, ఇప్పుడు మద్యం సేవించని వారిలో కూడా విస్తృతంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
భారతీయుల్లో దాదాపు 40 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారని, పిల్లల్లో కూడా 20 నుంచి 30 శాతం వరకు ఈ వ్యాధి కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. జన్యుపరమైన కారణాలతో పాటు మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, మధుమేహం, రక్తపోటు వంటి మెటబాలిక్ సమస్యలు ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని చెప్పారు.
షుగర్, బీపీకి అసలు కారణం తీపి పదార్థాలేనా? జీవనశైలే కీలకమంటున్న వైద్య నిపుణులు
ప్రత్యేకంగా ఫ్రక్టోజ్ అధికంగా ఉండే పానీయాలు, ఫ్రూట్ జ్యూసులు, బేకరీ పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్, నూడుల్స్ వంటి ఆహారాలు లివర్‌లో కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తున్నాయని వివరించారు. ఒకే నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం, డీప్ ఫ్రైడ్ ఆహారాలు తీసుకోవడం కూడా ప్రమాదకరమని హెచ్చరించారు.
ఫ్యాటీ లివర్ ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని “సైలెంట్ కిల్లర్”గా అభివర్ణిస్తున్నారు. అయితే అలసట, బలహీనత, చిరాకు వంటి లక్షణాలు క్రమంగా కనిపించవచ్చని తెలిపారు. అల్ట్రాసౌండ్‌తో పాటు ఫైబ్రోస్కాన్ పరీక్ష ద్వారా లివర్‌లో కొవ్వు మరియు ఫైబ్రోసిస్ స్థాయిని ఖచ్చితంగా గుర్తించవచ్చని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.
ఆరోగ్యకరమైన జీవనశైలే ఫ్యాటీ లివర్ నివారణకు ప్రధాన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, మిల్లెట్స్, తాజా కూరగాయలు, పెరుగు, చేపలు, వాల్‌నట్స్, బాదం వంటి ఆహారాలను తీసుకోవడం మంచిదని తెలిపారు. బ్లాక్ కాఫీ, అల్లం, పసుపు కలిపిన టీ కూడా లివర్ ఆరోగ్యానికి ఉపయోగపడుతాయని చెప్పారు.
అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, కృత్రిమ స్వీటెనర్లు, మద్యం, అధిక చక్కెర కలిగిన పానీయాలు, ఫ్రైడ్ ఫుడ్స్‌ను పూర్తిగా తగ్గించాలని సూచించారు. చిన్న వయస్సు నుంచే పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాల్సిన అవసరం ఉందని, లేకపోతే భవిష్యత్తులో ఫ్యాటీ లివర్ మరింత పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

బీపీ కూడా సైలెంట్ కిల్లరే.. జీవనశైలి మారిస్తే నియంత్రణ సాధ్యమని నిపుణుల సూచన

ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులు.. రూ.200 కోట్ల అక్రమాస్తులు?