మలబద్ధకం చిన్న సమస్య కాదు.. గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం

మలబద్ధకం చిన్న సమస్య కాదు.. గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. చాలామంది ప్రతిరోజూ మోషన్‌కు వెళ్తున్నప్పటికీ పూర్తిగా కడుపు శుభ్రం కాకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన శరీరంలోని జీర్ణవ్యవస్థను “రెండో మెదడు”గా పరిగణిస్తారు. గట్ హెల్త్ సరిగా ఉంటేనే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

గట్ హెల్త్ ఎందుకు అంత ముఖ్యము?

గట్ ఆరోగ్యంగా లేకపోతే ఒబేసిటీ, హార్మోన్ల అసమతుల్యత, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఉదయం మోషన్ సక్రమంగా కాకపోతే రోజంతా అసౌకర్యం, చిరాకు, ఏకాగ్రత లోపం కనిపిస్తాయి.

ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులు.. రూ.200 కోట్ల అక్రమాస్తులు?

మలబద్ధకానికి ప్రధాన కారణాలు

  • తగినంత నీరు తాగకపోవడం
  • ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం
  • జంక్ ఫుడ్ అధికంగా తినడం
  • వ్యాయామం లేకపోవడం
  • రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం
  • మోషన్‌ను తరచూ వాయిదా వేయడం

ప్రస్తుతం 80 నుంచి 90 శాతం మంది ఏదో ఒక స్థాయిలో మలబద్ధకంతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల్లో కూడా పెరుగుతున్న సమస్య

ఇటీవల 10 నుంచి 12 ఏళ్ల పిల్లల్లో కూడా మలబద్ధకం ఎక్కువగా కనిపిస్తోంది. వారానికి ఒక్కసారి మాత్రమే మోషన్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు, అలసట, ఏకాగ్రత లోపం, పైల్స్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

గట్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

లివర్ ని శుభ్రం చేసే పవర్ ఫుల్ డ్రింక్.

  • రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి.
  • ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
  • జామకాయ, బొప్పాయి, చిక్కుడుకాయ వంటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను ఆహారంలో చేర్చాలి.
  • ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్‌నట్స్ వంటి ఆహారాలు గట్‌కు మేలు చేస్తాయి.
  • రోజూ కనీసం గంటసేపు వ్యాయామం లేదా యోగా చేయాలి.
  • ఉదయం లేవగానే మోషన్‌కు వెళ్లే అలవాటు చేసుకోవాలి.

జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి

బ్రెడ్, కూల్‌డ్రింక్స్, మ్యాగీ, కేకులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి వాటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇవి గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి మలబద్ధకాన్ని పెంచుతాయి. పిల్లలకు ఇవి అలవాటైతే భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మట్టికుండలో వంట వల్ల ప్రయోజనం

నిపుణుల అభిప్రాయం ప్రకారం మట్టికుండలో వండిన ఆహారం సహజ గుణాలను ఎక్కువగా కాపాడుతుంది. తక్కువ నూనెతో వండుకోవచ్చు. ఆహారం రుచిగా ఉండటంతో పాటు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.

గట్ హెల్త్ కోసం ఉదయపు చిట్కా

ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగా జీలకర్ర, సోంపు, మెంతులు, ధనియాలు, వాము వేసి మరిగించి తాగితే జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.

మితాహారం – ఆరోగ్యానికి మంత్రం

అధిక ప్రోటీన్ లేదా అధిక కార్బోహైడ్రేట్లు తీసుకోవడం కంటే శరీరానికి అవసరమైన మోతాదులో సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వ్యాయామం చేయని వారు అధికంగా మాంసాహారం తీసుకుంటే జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది.

మన ఆరోగ్యం మొత్తం గట్ హెల్త్‌పైనే ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం, తగినంత నీరు, క్రమమైన నిద్ర, రోజువారీ వ్యాయామం ఉంటే మలబద్ధకం దూరమై శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. “గట్ హెల్తీగా ఉంటేనే జీవితం హెల్తీగా ఉంటుంది” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మోకాళ్ళ నొప్పి పోయి లేచి పరుగెడుతారు.

నిద్రలో కండరాలు పట్టేస్తున్నాయా? కారణాలు, నివారణ మార్గాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *