ప్రతి రోజు ఒక అరటి పండు తినడం వలన కలిగే లాభాలు తెలిస్తే ఇక జీవితంలో అరటి పండు విడిచిపెట్టరు.

ప్రతి రోజు ఒక అరటి పండు తినడం వలన కలిగే లాభాలు తెలిస్తే ఇక జీవితంలో అరటి పండు విడిచిపెట్టరు.

ప్రతి ఒక్కరి అందుబాటులో అతి తక్కువ ధరలో దొరికే అమూల్యమైన పండు అరటి. అయితే డాక్టర్ లు రోజు ఒక ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని, ఇక వైద్యుని దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. ఒక్క ఆపిల్ నుండి దొరికేవి అన్నీ ఒక అరటి పండులో కూడా దొరుకుతాయి. ఆపిల్ మాత్రమే కాదు రోజు ఒక అరటిపండు తిన్నకూడా ఆరోగ్యంగా జీవించవచ్చు. పేద ధనిక అని తేడా లేకుండా అందరికీ చవకగా ..

అన్ని సీజన్లలో లభించే అరటి పండు అని చెప్పవచ్చు. అయితే అరటి ని నిత్య ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన అనేక రకాల రోగాల నుండి బయటపడవచ్చు.కానీ కొందరు వ్యాపారులు ఈ పండ్ల ను కూడా కరాబు చేస్తున్నారు. త్వరగా పక్వానికి రావడానికి అరటి పండ్లను కార్బైడ్ తో మరగబెట్టి పసుపు రంగులోకి త్వరగా మరేలా చేస్తారు. కార్బైడ్ తో మరగబెట్టిన పండ్లను తినడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

కార్బైడ్ తో మగ్గిన పండలను ఎలా గుర్తుపట్టాలో తెలుసా మీకు? కార్బైడ్ తో మగ్గబెట్టిన పండ్ల యొక్క గుత్తి ఆకు పచ్చగా ఉంది పండు నిమ్మ పండు లాగా పసుపు కలర్లో పండు పై ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది.

సహజ సిద్దంగా పండిన పండ్లు ఎలా ఉంటాయో తెలుసా మీకు? సహాజంగా పండిన పండ్ల యొక్క గుత్తి పసుపు రంగులో ఉండి, పండు పై చుక్కలు చుక్కలు మచ్చలు ఉంటాయి. ఈ విధంగా ఉన్న పండ్లను మాత్రమే సహాజసిద్దం గా పండినవి గా గుర్తించాలి.

అరటి పండ్లను తినడం వలన కలిగే లాభాలను తెలుసుకుందాం:

  • రోజు ఒక అరటి పండు తినడం వలన ఆస్తమా సమస్య తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • ఒక అధ్యయనం ప్రకారం మహిళలు వారం లో ఒక రెండు మూడు అరటి పండ్లను తీసుకోవడం వలన కిడ్నీ సమస్య నుండి బయటపడవచ్చు రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు.
  • అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన ఎముకల మరియు దంతాల సంరక్షణకు చాలా ఉపయోగపడుతుంది.
  • అరటి పండు ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మలబద్దకం సమస్య తో భాదపడే వారు మలబద్దకం పోగొట్టుకోవచ్చు. అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.
  • అరటి పండులో లభించే పొటాషియం, ఫైబర్ లు రక్త పోటు ను తగ్గించడం లోనూ చాలా బాగా ఉపయోగపడుతుంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!